ప్రతీ వ్యక్తి సాధికారతే మైక్రోసాఫ్ట్ లక్ష్యం | Microsoft CEO Satya Nadella: Our industry only respects innovation | Sakshi
Sakshi News home page

ప్రతీ వ్యక్తి సాధికారతే మైక్రోసాఫ్ట్ లక్ష్యం

Published Wed, Jul 16 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

ప్రతీ వ్యక్తి సాధికారతే మైక్రోసాఫ్ట్ లక్ష్యం

ప్రతీ వ్యక్తి సాధికారతే మైక్రోసాఫ్ట్ లక్ష్యం

వాషింగ్టన్: భూగ్రహంపై ఉన్న ప్రతీ వ్యక్తి, ప్రతి సంస్థ సాధికారత కోసం ఉత్పాదకతను పునర్ ఆవిష్కరించడమే తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఈ మేరకు  మైక్రోసాఫ్ట్ భాగస్వాములకు, ఉద్యోగులకు ఒక లేఖను మెయిల్ చేశారు. ఇక్కడ సోమవారం నుంచి ప్రారంభమై 4రోజుల పాటు జరిగే 2014 వరల్డ్‌వైడ్ పార్ట్‌నర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ లేఖ రాశారు.

 ఈ సమావేశంలో ఆయన నేడు (బుధవారం) కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశానికి భారత్ నుంచి 150 మంది హాజరవుతున్నారు.  కాగా టెక్నాలజీ వినియోగంలో భారత్‌లోని చిన్నసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సంబంధిత విభాగ జనరల్ మేనేజర్  మీతుల్ బి. పటేల్ ఈ సమావేశంలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement