లూమియా ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు | Microsoft offers Rs 7,000 discount on Lumia 830, 930 | Sakshi
Sakshi News home page

లూమియా ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

Published Fri, Feb 20 2015 8:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

లూమియా ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

లూమియా ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు


స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మైక్రోసాప్ట్ లూమియా వినియోగదార్లను ఆకర్షించేందుకు స్పెషల్ ఆఫర్లు ఇస్తోంది. తాజాగా లూమియా మొబైల్స్ కొనుగోళ్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది.  లూమియా 830, 930 హాండ్ సెట్లపై రూ.7000 క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఫిబ్రవరి 20 నుంచి రిటైల్ స్టోర్స్లలో లూమియా ఫోన్లు కొనుగోలు చేసే వారికి వర్తిస్తుందని సంస్థ తెలిపింది.

స్టాక్ ఉన్నప్పుడే వినిమోగదారులు త్వరపడాలంటూ ప్రచారం చేస్తోంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తింపుతో లూమియా 830 రూ.21,800 కు, లూమియా 930 రూ.31,600 ధరలకు విక్రయిస్తున్నట్టు మైక్రోసాప్ట్ సంస్థ వెల్లడించింది. లూమియా 830 మోడల్ 5 అంగుళాల తెర, 16 గిగాబైట్ ఇంటర్నల్ మెమరీ, 10 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటు 1 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. దీంతో పాటు మెమరీ కార్డుతో 128 జీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవడానికి వీలుంటుంది.

లూమియా 930 మోడల్ 5 అంగుళాల తెర, 2.2 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ స్నాప్డ్రాగన్ 800 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో పాటు 20 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం దీని విశిష్టతలు. లూమియా 830, 930 హ్యాండ్ సెట్ లు విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఈ రెండు మోడల్స్ను గత అక్టోబర్ నెలలో రూ.28,799, రూ.38,649 ధరలతో మైక్రోసాప్ట్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement