Lumia 930
-
లూమియా ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మైక్రోసాప్ట్ లూమియా వినియోగదార్లను ఆకర్షించేందుకు స్పెషల్ ఆఫర్లు ఇస్తోంది. తాజాగా లూమియా మొబైల్స్ కొనుగోళ్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. లూమియా 830, 930 హాండ్ సెట్లపై రూ.7000 క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఫిబ్రవరి 20 నుంచి రిటైల్ స్టోర్స్‌లలో లూమియా ఫోన్లు కొనుగోలు చేసే వారికి వర్తిస్తుందని సంస్థ తెలిపింది. స్టాక్ ఉన్నప్పుడే వినిమోగదారులు త్వరపడాలంటూ ప్రచారం చేస్తోంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తింపుతో లూమియా 830 రూ.21,800 కు, లూమియా 930 రూ.31,600 ధరలకు విక్రయిస్తున్నట్టు మైక్రోసాప్ట్ సంస్థ వెల్లడించింది. లూమియా 830 మోడల్ 5 అంగుళాల తెర, 16 గిగాబైట్ ఇంటర్నల్ మెమరీ, 10 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటు 1 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. దీంతో పాటు మెమరీ కార్డుతో 128 జీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవడానికి వీలుంటుంది. లూమియా 930 మోడల్ 5 అంగుళాల తెర, 2.2 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో పాటు 20 మెగా పిక్సల్ కెమెరా సామర్థ్యం దీని విశిష్టతలు. లూమియా 830, 930 హ్యాండ్ సెట్ లు విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఈ రెండు మోడల్స్‌ను గత అక్టోబర్ నెలలో రూ.28,799, రూ.38,649 ధరలతో మైక్రోసాప్ట్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్.. మూడు లూమియా స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ లూమియా రేంజ్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ మూడు ఫోన్లు- లూమియా 730(ధర రూ.15,299), లూమియా 830(ధర రూ.28,700), లూమియా 930(ధర రూ.38,649)కు 1 టెర్రాబైట్ క్లౌడ్ స్టోరేజ్ ఆరు నెలల పాటు ఉచితమని, ఆ తర్వాతి నుంచి నెలకు రూ.125 చార్జ్ చేస్తామని కంపెనీ తెలిపింది. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే లూమియా 830లో 10 మెగాపిక్సెల్ ప్యూర్‌వ్యూ కెమెరా, లూమియా డెనిమ్ అప్డేట్, 15 జీబీ ఉచిత స్టోరేజ్నిచ్చే వన్ డ్రైవ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ విక్రయాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. లూమియా 730లో డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ నెల 6 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక లూమియా 930లో 20 మెగా పిక్సెల్ ప్యూర్‌వ్యూ కెమెరా, 2.2 గిగా హెర్ట్స్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ఈ నెల 15 నుంచి లభిస్తుంది. విండోస్‌ను భారత్‌లో విస్తరించడమే లక్ష్యమని నోకియా ఇండియా ఎండీ అజేయ్ మెహతా చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లనందిస్తామని వివరించారు. -
మన మార్కెట్లోకి లూమియా 930
అక్టోబర్ 15 వ తేదీ నుంచి ఇండియన్ మార్కెట్లో లూమియా 930ని అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ స్టార్ట్‌ఫోన్ విడుదల అయ్యింది. జూన్కళ్లా భారత్‌లో అందుబాటులోకి వస్తుందని టెక్ పండితులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు ఫలించలేదు. క్వాల్కామ్స్నాప్డ్రాగన్ 800 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 2జీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. దీనికి మెమొరీ కార్డ్ స్లాట్ ఏదీ ఉండదు. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫోటోగ్రఫీ ప్రేమికులను తెగ ఆకట్టుకొంటోంది. లూమియా 1520 లాగే ఈ ఫోన్లో కూడా 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్ విషయంలో కూడా నోకియా రిచ్ రికార్డింగ్ టెక్నాలజీ ఇన్స్టాలై ఉంటుంది. ఇందులో ఆడియో రికార్డింగ్ టెక్నాలజీ కూడా అద్వితీయం అనే రివ్యూలు వినిపిస్తున్నాయి. వైర్లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే బ్యాటరీ మరో ప్రత్యేకత. ధర దాదాపు 38,649 రూపాయలు. శామ్సంగ్ నుంచి 4జీ ఫోన్! మన దగ్గర ఇంకా మారుమూల ప్రాంతాలకు త్రీజీ సేవలే ప్రవేశించలేదు కానీ... అప్పుడే నాలుగోతరం ఇంటర్నెట్ సేవలను అందిపుచ్చుకోవడానికి తగిన స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కొరియన్ దిగ్గజం శామ్సంగ్ ఒక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ సిరీస్‌లో శామ్సంగ్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు గెలాక్సీ ఆల్ఫా 4జీ. నాలుగో తరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో వాటికి తగ్గట్టుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించినట్టుగా శామ్సంగ్ పేర్కొంది. 6.7మిల్లీమీటర్ల థిన్నెస్తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ బరువు కేవలం 115 గ్రాములే. 4.7 ఇంచ్ హెచ్డీ ఏమొలెడ్ డిస్ప్లేతో, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఉండే దీనికి 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంటుంది. గెలాక్సీ గేర్ ఫిట్, గేర్ 2, గేర్2 నియో, అండ్గేర్ ఎస్ వంటి వేరబుల్ డివెజైస్‌తో ఈ ఫోన్ కనెక్ట్ అవుతుంది. భారత్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ విలువ దాదాపు 40 వేల రూపాయలు.