
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ అగ్రిగేటర్ దుకాన్‌లైన్ ఇండియా తాజాగా మైస్టోర్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా 21,800 మంది విక్రేతలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్టు దుకాన్‌లైన్ చైర్మన్ కృష్ణ లకంసాని శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఆఫ్‌లైన్లో విస్తరణలో భాగంగానే మైస్టోర్స్‌ను చేజిక్కించుకున్నట్టు చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 117 రిటైల్ ఔట్‌లెట్లను తెరిచామని మైస్టోర్ ఫౌండర్ పోతిని శ్రీనివాసరావు తెలిపారు. చిన్న నగరాల్లో మరిన్ని స్టోర్లను నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు. ఇకనుంచి ‘దుకాన్‌లైన్ మైస్టోర్’ పేరుతో స్టోర్లను నిర్వహిస్తారు. కాగా, 950కిపైగా బ్రాండ్ల ఉత్పత్తులను కస్టమర్లు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునేలా దుకాన్‌లైన్ భాగస్వామ్య షాపుల్లో కియోస్క్‌లు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment