ఇదో మంత్రగత్తె వేట..!
ముంబై: ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్ పై సోమవారం ఉదయంజరిగిన సీబీఐ దాడులపై ఎన్‌డీటీవీ యాజమాన్యం స్పందించింది. తప్పుడు అభియోగాలతో ప్రభుత్వం తమపై వేధింపులకు దిగుతోందని ఆరోపించింది. సీబీఐ అవే పాత అంతులేని తప్పుడు ఆరోపణల ఆధారంగా, ఎన్‌డీటీవీని, తన ప్రమోటర్లపై సీబీఐ దాడులతో తీవ్రంగా వేధింపులు చేపట్టిందని మండిపడింది. వివిధ ఏజెన్సీల ద్వారా తమపై విచ్‌హంట్ పాల్పడుతోందని, దీనికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని ప్రకటించింది.
భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరంగా సాగుతున్న ఈ మంత్రగత్తె-వేటకు వ్యతిరేకంగా తాము అలుపెరుగని పోరాటాని చేస్తామని ప్రకటించింది. ఈ కుటిల యత్నాలకు లొంగిపోమని, తమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నవారికి తమ దగ్గర సమాధానం ఉందని తెలిపింది. ఈ శక్తులపై పోరాడుతూ తమ దేశాన్ని కాపాడుకుంటామని ఎన్‌డీటీవీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అటు ప్రముఖ ఎడిటర్ ఎన్‌రామ్, రాజ్‌దీప్ సర్‌దేశాయ్ లాంటి వారు కూడా ఈ సీబీఐ దాడులను ఖండించారు. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తమకు వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్రలో భాగంగానే సంస్థ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంట్లో సీబీఐ దాడులు చేసిందంటూ ఎన్‌డీటీవీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ వ్యవహారంపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ కుట్రలేదనీ, అసలు ఈ వ్వయహారంతో కేంద్రం కలగజేసుకోదని స్పష్టం చేశారు.
కాగా ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Today’s CBI raid on @PrannoyRoyNDTV is a defining moment: the last time this sort of thing happened was during the Emergency
— Praveen Swami (@praveenswami) June 5, 2017