witch-hunt
-
పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!
గద్వాల : ప్రజల అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మంత్రాల పేరిట డబ్బు దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఈ ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.62.5 లక్షలను ఎత్తుకెళ్లారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఎనిమిది మంది మోసగాళ్లను గద్వాల జిల్లా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ ఈ ముఠా చేసిన మోసాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట జనాన్ని మభ్యపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పూజల పేరిట నమ్మించి.. రూ.62 లక్షలకు టోకరా 2019 అక్టోబర్‌లో ఈ ముఠా సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డిని కలసి మాయమాటలు చెప్పి ఇంట్లో నాగదేవత పేరిట పాముకు ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మించారు. అలాగే తమ వద్ద ఉన్న మహిమగల భస్మం, విభూతిని ఇంట్లో చల్లితే కష్టాలు పోయి పెద్ద ధనవంతులు అవుతారని, పూజలో డబ్బులు ఉంచితే పదింతలు అవుతాయని చెప్పారు. దీంతో బాధితుడు ఇంట్లో ఉన్న రూ.62.5 లక్షలను పూజలో ఉంచాడు. ముఠాసభ్యులు పూజ పేరిట కొద్దిసేపు హడావుడి చేసి పథకం ప్రకారం అప్పటికే మత్తు కలిపిన పౌడర్‌ను అతడిపై చల్లి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. డబ్బులు వస్తాయన్న భ్రమలో ఉన్న బాధితుడు రెండు రోజుల తర్వాత మంత్రగాళ్లు మోసం చేశారని గుర్తించి అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో ఈ ముఠాసభ్యులు గత నెల 30వ తేదీన అయిజ మండలం తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్కు కూడా మాయమాటలు చెప్పారు. పూజలకోసం భస్మం, విభూతి డబ్బా కొనేందుకు రూ.10 లక్షలు కావాలని అడిగారు. అయితే అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.30 వేలు ముఠా సభ్యులకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున అయిజ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు, రెండు రాగి రింగులు, భస్మం, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. పామును అటవీ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ కేసుల దర్యాప్తులో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు. -
అర్నాబ్ న్యాయ పోరాటం
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసుకు సంబంధించి తన 'అక్రమ అరెస్టు' ను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని, తన ఇంట్లోకి చొరబడి మరీ పోలీసులు తనపైనా,తన కుటుంబంపైనా దాడిచేశారని అర్నాబ్ పిటిషన్లో ఆరోపించారు. తనను అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన కుమారుడిపై దాడిచేశారన్నారు. తన ఛానెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇది మరో ప్రయత్నమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేటాడుతున్నారని(విచ్–హంట్ చేస్తున్నారని) తన పిటిషన్లో అర్నాబ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తరువాత ఆయనను అలీబాగ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. (అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) -
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. #NEWS: Amnesty International India Halts Its Work On Upholding Human Rights In India Due To Reprisal From Government Of Indiahttps://t.co/W7IbP4CKDq — Amnesty India (@AIIndia) September 29, 2020 -
హత్య చేసి, ఆపై తల నరికి...
జార్ఖండ్ : చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తుల చేతిలో వృద్ద దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కుంతి జిల్లాలోని దద్గామా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దద్గామా గ్రామానికి చెందిన సత్రి ముండా, జావ్నీ దేవి దంపతులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కొంత మంది గ్రామస్తులు వారితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి వీరి ఇంటిలోకి ప్రవేశించిన ఆరుగురు వ్యక్తులు.. పదునైన ఆయుధంతో ముండాపై దాడి చేయడంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. భర్తపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జావ్నీని కూడా దారుణంగా హతమార్చిన దుండగులు ఆమె తల నరికి దూరంగా పడేశారు. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న ముండా కుమారుడు, కోడలు, మనవరాలిపై కూడా దుండగులు దాడికి యత్నించగా వారు తప్పించుకొని పారిపోయారు. కాగా మూఢ నమ్మకాల వల్లే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని.. అయితే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సిన అవసరం ఉందని కుంతి ఎస్పీ అశ్విన్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని... ఆరుగురు నిందితులను గుర్తించామని త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఇదో మంత్రగత్తె వేట..!
ముంబై: ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్ పై సోమవారం ఉదయంజరిగిన సీబీఐ దాడులపై ఎన్డీటీవీ యాజమాన్యం స్పందించింది. తప్పుడు అభియోగాలతో ప్రభుత్వం తమపై వేధింపులకు దిగుతోందని ఆరోపించింది. సీబీఐ అవే పాత అంతులేని తప్పుడు ఆరోపణల ఆధారంగా, ఎన్డీటీవీని, తన ప్రమోటర్లపై సీబీఐ దాడులతో తీవ్రంగా వేధింపులు చేపట్టిందని మండిపడింది. వివిధ ఏజెన్సీల ద్వారా తమపై విచ్‌హంట్ పాల్పడుతోందని, దీనికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరంగా సాగుతున్న ఈ మంత్రగత్తె-వేటకు వ్యతిరేకంగా తాము అలుపెరుగని పోరాటాని చేస్తామని ప్రకటించింది. ఈ కుటిల యత్నాలకు లొంగిపోమని, తమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నవారికి తమ దగ్గర సమాధానం ఉందని తెలిపింది. ఈ శక్తులపై పోరాడుతూ తమ దేశాన్ని కాపాడుకుంటామని ఎన్డీటీవీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అటు ప్రముఖ ఎడిటర్ ఎన్రామ్, రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి వారు కూడా ఈ సీబీఐ దాడులను ఖండించారు. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తమకు వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్రలో భాగంగానే సంస్థ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంట్లో సీబీఐ దాడులు చేసిందంటూ ఎన్డీటీవీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ వ్యవహారంపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ కుట్రలేదనీ, అసలు ఈ వ్వయహారంతో కేంద్రం కలగజేసుకోదని స్పష్టం చేశారు. కాగా ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. Today’s CBI raid on @PrannoyRoyNDTV is a defining moment: the last time this sort of thing happened was during the Emergency — Praveen Swami (@praveenswami) June 5, 2017