వొడాఫోన్‌కు మళ్లీ పన్ను నోటీసులు
న్యూఢిల్లీ: వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ మళ్లీ షాకిచ్చింది. హచిసన్ వాంపోవా భారత కార్యకలాపాల కొనుగోలు డీల్‌కు సంబంధించి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ నోటీసులు పంపించింది. చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. 2007లో హచిసన్ వాంపోవాకి చెందిన భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 11 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా రూ. 7,990 కోట్లు కట్టాలంటూ అప్పట్లో ఐటీ నోటీసులిచ్చింది. అయితే డీల్ విదేశంలో జరిగినందున భారత్‌లో తాము పన్నులు కట్టనక్కర్లేదంటూ వొడాఫోన్ దీన్ని వ్యతిరేకిస్తోంది. 2012లో సుప్రీం వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఆ తర్వాత పన్నుల చట్టాల్లో సవరణలతో వివాదం ఆర్బిట్రేషన్‌కు మళ్లింది.