
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటక ప్రాంతాలను సందర్శించడమంటే అందరికీ ఇష్టమే. కానీ, సమస్యల్లా ఏ ప్రాంతానికి ఏ సమయంలో వెళ్లాలి? టికెట్ల బుకింగ్స్.. స్థానిక భోజన వసతుల ఏర్పాట్లెలా? ఇవే. మహిళలకైతే మరీను. వీటి పరిష్కారమే రష్మీ చద్దా చేత వోవోయెజ్‌ను ఆరంభింపజేసింది. మహిళలకు మాత్రమే సేవలందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు రష్మీ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. పలు బహుళ జాతి కంపెనీల్లో పని చేశా. ఉద్యోగ రీత్యా పలు దేశాలకు తిరిగా. వెళ్లిన ప్రతి చోటా ప్రయాణ ఇబ్బందులెదురయ్యేవి. హోటల్ బుకింగ్‌తో మొదలుపెడితే స్థానిక టూరిజం ప్రదేశాలు, గైడ్, ఆహార ఏర్పాట్లు ప్రతిదీ ఇబ్బందే. ఇదే నాకు వ్యాపార అవకాశాన్ని కల్పించింది. 2016 అక్టోబర్‌లో రూ.6 లక్షల పెట్టుబడితో ఢిల్లీ కేంద్రంగా వోవోయెజ్.కామ్ సంస్థను ప్రారంభించా. ఠీౌఠిౌy్చజ్ఛ.ఛిౌఝలో వో అంటే ఉమెన్ అని, వయాజ్ అంటే యాత్ర అని అర్థం. మొత్తంగా మహిళల జర్నీ అని అర్థం వచ్చేలా దీన్ని ఆరంభించా.
విదేశీయులు తొలుత చూసేది తాజ్ మహలే..
అమెరికా, జపాన్, జర్మనీ దేశాల నుంచి విదేశీ పర్యాటకులు ఎక్కువగా మా సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రథమంగా వీళ్లు సందర్శించేది తాజ్ మహల్. ఆ తర్వాత హంపి, వారణాసి ప్రాంతాలు. ఈ మధ్య కోల్‌కతా, హైదరాబాద్ సందర్శకులూ పెరుగుతున్నారు. ప్రస్తుతం నెలకు 60 ట్రిప్పులు జరుగుతున్నాయి. ఏడాదిలోగా నెలకు 250 టిప్పులు నిర్వహించే స్థాయికి చేరాలని లకి‡్ష్యంచాం. ప్రతి బుకింగ్‌పై 20 శాతం కమీషన్ ఉంటుంది. గత నెలలో రూ.6.5 లక్షల లాభాన్ని ఆర్జించాం. ప్రతి నెలా 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం.
సొంతంగా కార్ల సేవలు..
ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో మరో 12 మందిని నియమించుకోనున్నాం. ఛత్తీస్‌గఢ్ పర్యాటక ప్రచారం నిమిత్తం స్థానిక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన (మార్చి 8) సేవలను ప్రారంభిస్తున్నాం. ‘‘కస్టమర్లను ఇంటి నుంచి విమానాశ్రయానికి, స్థానిక ప్రదేశాల పర్యటనకు తీసుకెళ్లటానికి సొంతంగా కార్లతో పాటు మహిళా డ్రైవర్లను నియమించుకుంటున్నాం. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. పలువు రు విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిధుల సమీకరణకు మరికొంత సమయం పడుతుంది’’ అని రష్మీ వివరించారు.
దేశ, విదేశాల్లో వెయ్యి మంది వెండర్లతో ఒప్పందం
మన దేశంతో పాటూ జపాన్, భూటాన్, దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, యూరప్, అమెరికా, జర్మనీ వంటి పలు దేశాల పర్యాటక ప్రాంతాలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా స్థానిక ప్రదేశాల్లోని హోటళ్లు, బస్సు, విమాన, గైడ్స్ కోసం సుమారు వెయ్యి మంది వెండర్లతో అగ్రిగేట్ చేసుకున్నాం. విమాన టికెట్ల కోసం స్పైస్ జెట్,విస్తారా, ఇండిగోలతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 252 ట్రిప్పులు నిర్వహించాం. ట్రిప్పుకు గరిష్టంగా 38 మంది సభ్యులుంటారు. మొత్తం కస్టమర్లలో హైదరాబాద్ నుంచి 20 శాతం వాటా ఉంటుంది. పుణె, ముంబై, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment