రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రతిపాదనేమీ లేదని తేల్చిచెప్పారు. ప్రొఫెసర్‌గా తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫు నుంచి రాజన్‌ను రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రొఫెసర్‌గా తానెంతో సంతోషంగా ఉన్నానని, రోజుకు చాలా గంటలు పనిచేసే బ్రెయిన్ తనకు ఉందని, నేనే ఇష్టపడే ఉద్యోగం ఇదే అని తెలిపారు.
రాజకీయాల్లోకి ప్రవేశంపై వెనువెంటనే నో అని చెప్పేశారు. తన భార్యకు కూడా ఇష్టంలేదని, తను చాలా స్పష్టంగా వద్దని చెప్పినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ సీటును ఆప్ రాజన్‌కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌ను ఆర్‌బీఐ మాజీ గవర్నర్ తిరస్కరించినట్టు తెలిసింది. మరో పుస్తకం కూడా తాను రాస్తున్నట్టు తెలిపారు. రాజన్ చివరి పుస్తకం ' ఐ డూ వాట్ ఐ డూ'. సెప్టెంబర్‌లో ఈ బుక్ విడుదలైంది. దేశీయ ఆర్థికవ్యవస్థ గురించి పలు అంశాలను ఇది స్పృశించింది. జీఎస్టీ గురించి మాట్లాడిన రాజన్, దీర్ఘకాలికంగా ఇది చాలా మంచిదని, కానీ కొన్ని సమస్యలున్నట్టు తెలిపారు. ఈ ఆటుపోట్లను తొలగించాల్సినవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment