ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం లేదు: షాప్‌క్లూస్ | No merger talks with Flipkart, says ShopClues | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం లేదు: షాప్‌క్లూస్

Published Thu, Jul 21 2016 2:11 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం లేదు: షాప్‌క్లూస్ - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం లేదు: షాప్‌క్లూస్

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌తో విలీన వార్తలను ఈ  కామర్స్ సంస్థ షాప్‌క్లూస్ తోసిపుచ్చింది. విలీనం కోసం ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరుపుతున్నామన్న వార్తల్లో నిజం లేదని షాప్‌క్లూస్ సీఈఓ సంజయ్ సేథి చెప్పారు. విలీనం వల్ల మేలు జరగే అవకాశాలున్నాయని, అయితే వ్యాపారం వృద్ధిచెందుతుందనే గ్యారంటీ లేదని పేర్కొన్నారు.

డబ్బే ప్రధానమని, వ్యాపారం నడవడమే ముఖ్యమని అనుకుంటే,  టాటాలు బిర్లాలు ఎప్పుడో తమ తమ కంపెనీలను విలీనం చేసేవాళ్లని వ్యాఖ్యానించారు. టాటాలు, బిర్లాలు ఒకరితో ఒకరు పోటీపడుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారని వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లోనూ, తమ సంస్థలోనూ టైగర్ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు పెట్టిందన్న ఒకే కారణంతో ఈ రెండు సంస్థల విలీనం జరగవచ్చంటూ వార్తలు రావడం సరికాదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement