న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ ఈ ఏడాది 8 శాతం వృద్ధితో 167 బిలియన్ డాలర్లకు చేరొచ్చని, లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించొచ్చని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ‘నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ నన్ను కలిశారు. దేశీ ఐటీ రంగానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించుకున్నాం.
పరిశ్రమ 2018లో 8 శాతం వృద్ధితో 167 బిలియన్ డాలర్లకు చేరొచ్చని, ప్రత్యక్షంగా 39.7 లక్షల మందికి ఉపాధి లభించొచ్చని (గతేడాది పోలిస్తే అదనంగా 1,05,000 మందికి) ఆమె నాతో చెప్పారు’ అని మంత్రి ట్వీట్ చేశా రు. కాగా మరొక కార్యక్రమంలో పాల్గొన్న దేవయాని ఘోష్.. ఇండియా–యూకే టెక్ రాకెట్‌షిప్ అవార్డ్స్ 4వ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ఇందులోని విజేతలకు లండన్ టెక్ వీక్‌లో పాల్గొనేందుకు ఒకవారం యూకేకు వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment