టెక్ సెంటర్ ప్రారంభోత్సవంలో జయేశ్, కంపెనీ ప్రతినిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఉన్న యూఎస్ కంపెనీ పేపాల్ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 100 సీట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మంగళవారం ఈ టెక్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇప్పటికే సంస్థకు చెన్నై, బెంగళూరులో ఇటువంటి కేంద్రాలున్నాయి. భారత్‌లో 3,500 మంది వరకు ఉద్యోగులున్నారు. భాగ్యనగరికి చెందిన ఫ్రాడ్ ప్రివెన్షన్ సేవల కంపెనీ సిమిలిటీని 2018లో పేపాల్ సుమారు రూ.810 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment