paypal
-
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్‌గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
లేఆఫ్ బాటలో ‘పేపాల్’.. 2వేల మంది ఉద్యోగుల తొలగింపు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. వేలాదిగా ఉద్యోగులను వదిలించుకుంటున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల బాటలో ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల వేదిక ‘పేపాల్’ పయనిస్తోంది. మందగించిన ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపుతూ దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2వేల మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించనున్నట్లు కంపెనీ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ డ్యాన్ షుల్మన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యయాన్ని తగ్గించుకుని ప్రధాన లక్ష్యాల సాధనపై మరింత దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పేపాల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 429 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఎక్కువ మంది యూక్టివ్ యూజర్లు గల కంపెనీల జాబితాలో 5వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో పేపాల్ సంస్థ గత నవంబర్‌లో తమ కంపెనీ రెవెన్యూ వృద్ధి అంచనాను తగ్గించుకుంది. కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపర 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ గత నెలలోనే ప్రకటించింది. అదే బాటలో మైక్రోసాఫ్ట్ 10వేల మందిని, సేల్స్ ఫోర్స్ 7వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పోటిఫై దాదాపు 10వేల మందిని తొలగిస్తున్నట్లు గత వారమే వెల్లడించింది. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌ను నియమించిన ఎలన్ మస్క్..!
Sanjay Bhargava To Join Musk Starlink As India Country Director: భారత్ కార్ల మార్కెట్ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే భారత టెలికాం డిపార్ట్మెంట్ నుంచి స్టార్‌లింక్ అనుమతులను కూడా ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవను స్పేస్ఎక్స్ నియమించింది. చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! పేపల్ నుంచి... అక్టోబర్ 1 నుంచి స్టార్‌లింక్ ఇండియా డైరక్టర్‌గా సంజయ్ భార్గవ పనిచేయనున్నారు. సంజయ్ భార్గవ తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశారు. గతంతో పేపల్ ఫిన్‌టెక్ సంస్థలో సంజయ్ పనిచేశారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ భరోసా క్లబ్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. స్టార్‌లింక్ సేవలు త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సంజయ్ భార్గవ వెల్లడించారు. భారత్‌లో టెలికాం రెగ్యూలేటరీ ట్రాయ్ నుంచి త్వరలోనే ఆమోదం వస్తోందని సంజయ్ అభిప్రాయపడ్డారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? -
జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!
జీ-మెయిల్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల ఒక కొత్త ఈ-మెయిల్ స్కామ్ బయట పడింది. అమాయక వినియోగదారులు లక్ష్యంగా చేసుకొని ఈ-మెయిల్ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. తాజా ఈ-మెయిల్ కుంభకోణం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. యూజర్లను మోసం చేయడానికి నెరగాళ్లు పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికోసం మీరు నకిలీ లింక్ లపై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మాల్ వేర్ ను మీ ఫోన్లలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ జీ-మెయిల్ స్కామ్ భిన్నమైనది.(చదవండి: నాలుగు టెస్లా మోడల్ కార్లకు భారత్ ఆమోదం..!) సైబర్ నెరగాళ్లు ఇప్పుడు అమెజాన్,పే పాల్ వంటి పెద్ద కంపెనీల పేరుతో ఈ-మెయిల్స్ పంపుతున్నారు. అందులో ‘‘మీ అమెజాన్ ఖాతా నుంచి మీరు యాపిల్ వాచ్ / గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులను పేపాల్ ద్వారా కొనుగోలు చేశారు. ఒకవేళ మీరు ఈ కొనుగోలు చేయనట్లయితే, దయచేసి కింద సూచించిన నంబర్‌కి ఫోన్ చేయండి’’ అని అందులో ఉంటుంది. నిజానికి ఆ నెంబర్ అమెజాన్/పే పాల్ సంస్థకు చెందినది కాదు. సైబర్ నెరగాళ్లు మీ పాస్ వర్డ్లు, బ్యాంకు వివరాలతో సహా సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఆ ఈ-మెయిల్స్ తొలగించండి నకిలీ ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. అంతేగాక ఫోన్ చేసినప్పుడు యూజర్ కంప్యూటర్లలో వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చేసి అందులోని డేటా దొంగిలిస్తున్నట్లు ఒక సైబర్ భద్రత సంస్థ కాస్పర్ స్కై పేర్కొంది. ఈ కొత్త ఈ-మెయిల్ కుంభకోణానికి 'విషింగ్' అని పేరు పెట్టారు. జీ-మెయిల్ కస్టమర్లకు ప్రతి రోజు ఈమెయిల్స్ పంపిస్తున్నట్లు కాస్పర్ స్కైలోని ఒక బృందం చెప్పింది. అందుకే యూజర్స్ ఇలాంటి ఈ-మెయిల్స్ వస్తే ఓపెన్ చేయకుండా ముందు జాగ్రత్తగా అమెజాన్ లేదా పేపాల్ ఖాతాలను ఓపెన్ చేసి వాటి నుంచి లావాదేవీ జరిగిందా లేదా అనేది చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సదరు మెయిల్ మోసపూరితమని అనుమానం కలిగితే వెంటనే డిలీట్ చేయాలని భద్రత నిపుణులు సూచిస్తున్నారు. -
గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ పేపాల్ ఇంజనీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2021లోభారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్‌లో ఈ నియామకాలు జరుగుతాయి.హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని డెవలప్మెంట్ సెంటర్లలో దాదాపు వేయి మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చకోనున్నామని పేపాల్ తాజాప్రకటనలో తెలిపింది కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ చెల్లింపులకుడిమాండ్ పెరిగిందనీ, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారతదేశంలోని మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులున్నారు. అమెరికా తరువాత భారతదేశంలోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవన్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరన నేపథ్యంలో వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ అన్నారు. కాగా దేశీయంగా ఏప్రిల్ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు గత నెలలో పేపాల్ ప్రకటించింది. భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో పేపాల్ టెక్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఉన్న యూఎస్ కంపెనీ పేపాల్ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 100 సీట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మంగళవారం ఈ టెక్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇప్పటికే సంస్థకు చెన్నై, బెంగళూరులో ఇటువంటి కేంద్రాలున్నాయి. భారత్‌లో 3,500 మంది వరకు ఉద్యోగులున్నారు. భాగ్యనగరికి చెందిన ఫ్రాడ్ ప్రివెన్షన్ సేవల కంపెనీ సిమిలిటీని 2018లో పేపాల్ సుమారు రూ.810 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
భారత మార్కెట్లోకి పేపాల్ ఎంట్రీ
ముంబై: అంతర్జాతీయ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేపాల్ హోల్డింగ్స్ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత వినియోగదారులు ఇక దేశీయంగా కూడా పలు ప్రముఖ పోర్టల్స్‌లో తమ చెల్లింపుల సర్వీసుల ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చని పేపాల్ పేర్కొంది. దాదాపు దశాబ్ద కాలంగా భారత్‌లో చిన్న, మధ్యతరహా సంస్థలు, ఫ్రీలాన్సర్స్కి సీమాంతర చెల్లింపుల సేవలు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల విస్తరణకు.. డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు కాకుండా నాణ్యమైన సేవలు అందించడంపైనే దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశీయంగా జరిగే బిజినెస్ టు కస్టమర్ (బీ2సీ) ఎగుమతి లావాదేవీల్లో మూడో వంతు వాటా తమదే ఉంటోందని పేపాల్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) లైసెన్స్ తీసుకునే అవకాశాలను కూడా పేపాల్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. డిజిటల్ చెల్లింపులకు భారత్ ఊతమిస్తున్న నేపథ్యంలో ఈ–టూరిస్ట్ వీసా, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించి పలు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో కూడా చేతులు కలిపినట్లు సంస్థ కంట్రీ మేనేజర్ అనుపమ్ పహుజా తెలిపారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు మరింతగా పెరగనున్న నేపథ్యంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల కస్టమర్లు తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి రాగలరని ఆసియాపసిఫిక్ ప్రాంత కార్యకలాపాల జీఎం రోహన్ మహదేవన్ తెలిపారు. పేపాల్ సర్వీసులు అందుబాటులో ఉండే పలు వ్యాపార సంస్థల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. అయితే, వీటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజాలు లేకపోవడం గమనార్హం. వీటితో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు పేపాల్ పేర్కొంది. -
ఇండియాలో పేపాల్ సర్వీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ బుధవారం భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ చెల్లింపులకు అందుబాటులో పేమెంట్ సంస్థ పే పాల్ ఇకపై భారతీయులు కూడాఅంతర్జాతీయంగా కూడా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ ప్రకటింటింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారంగా ఉన్న ఆన్ లైన్ ద్వారా ఒకపై పే పాల్ ద్వారా ఒకనుగోళ్లు చేయవచ్చని పేపాల్ హోల్డింగ్స్ ఒకప్రకటనలో తెలిపింది. తద్వారా స్థానిక , ప్రపంచ చెల్లింపులను ప్రాసెస్ చేయగలరని తెలిపింది.భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ సర్వీసులు అందించడం ద్వారా డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేపాల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ పాహుజా పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, వ్యాపార అవకాశాలు మెరుగుపర్చుకునే లక్ష్యంతో తమ మారథాన్ ఇపుడే మొదలైందని పేపాల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రోహన్ మహదేవన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పేపాల్ 218 మిలియన్ల మంది వినియోగదారులతో భారతీయ వినియోగదారుల ఏకీకరణ సాధ్యం మవుతుందున్నారు. అంటే ఇప్పటిదాకా క్రెడిట్ కార్డు చెల్లింపులను మాత్రమే అంగీకరించిన పేపాల్ ఇకపై భారతీయ డెబిట్ కార్డ్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే...వినియోగదారుల ఫిర్యాదులు కేవలం 30 సెకన్లలో , పెద్ద సమస్య అయితే 5 నిమిషాల్లోనూ పరిష్కరిస్తామని పాహుజా తెలిపారు. అలాగే పే పాల్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసినపుడు... పేమెంట్ పూర్తియినా.. ఆవస్తువు డెలివరీ కాకపోతే ఆరె నెలలు(180 రోజులు) లోపల ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అపుడు నిబంధనల మేరకు ఆ క్యాష్‌న రిఫండ్ చేస్తామన్నారు. అలాగే వస్తువులు కొనుగోలు చేసిన కస్టమర్లు సదరు నగదు చెల్లించకపోతే వ్యాపారుల ప్రయోజనార్థం ఆ బాధ్యతను కూడా పేపాల్ తీసుకుంటుందట. -
పేటీఎంకు మరో షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత బాగా పాపులర్ అయిన మొబైల్ కామర్స్ , చెల్లింపుల కంపెనీ పేటిఎం కు భారీ షాక్ తగలనుంది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో అమెరికన్ పేమెంట్ దిగ్గజం, ప్రపంచ చెల్లింపుల కంపెనీ పేపాల్ తాజాగా కేసు నమోదు చేసింది. తమ లోగోకు సమానమైన ఒక లోగోను పేటీఎం అక్రమంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. దీంతో ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణల్లో ఐటీసీ, మెక్ డోవెల్ లాంటి భారతీయ కంపెనీల సరసన చేరింది. కాలిఫోర్నియాకు చెందిన పే పాల్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనల కింద పే టీఎంపై కేసు నమోదు చేసింది. సుమారు14 పేజీల పత్రంలో పేటీఎంపై ఫిర్యాదు చేసింది. 1999 ఇండియన్ ట్రేడ్ మార్క్ చట్టం అయిదు రకాల లోగోలను రిజిస్టర్ చేసినట్టు తెలిపింది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. 2007 సం.రం నుంచి తాము దీన్ని వాడుతున్నట్టు పేర్కింది. తమ లోగోను అక్రమంగా వాడుకోవడం ద్వారా తమ ఖాతాదారుల్లో, ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని తెలిపింది. ఈ గందరగోళం, మోసంకారణంగా తమ బ్రాండ్ ఈక్విటీ తగ్గిపోయే అవకాశ ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో వన్ 97 పేరుతో దాఖలైన పేటీఎం ట్రేడ్‌మార్క్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అతి పెద్ద లబ్దిదారుగా అవతరించిన పే టీఎం గత నెలలో తన వినియోగదార్ల బేస్ గా భారీగా పెంచుకుంది. దేశంలో చిన్న చెల్లింపులు బ్యాంకుగా ఆర్బిఐ లైసెన్స్ ఉన్న పేటీఎం 14 మిలియన్ కొత్త వినియోగదారులను సాధించింది. సుమారు 100 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పేటీఎం చురుగ్గా కదులుతోంది. నగదు రహిత భారతంకోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తూ తన సేవలను ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు కొంతమంది ఆన్లైన్ మోసగాళ్లు తమను చీట్ చేశారని డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన
హైదరాబాద్: భారత దేశపు అతిపెద్ద బ్రాండెడ్ నెట్వర్క్ హోటల్ సంస్థ ఓయో రూమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అంతర్జాతీయ ఓపెన్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేపాల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఈ కామర్స్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని, అదే విధంగా ఆన్లైన్ చెల్లింపుల్లో రిస్క్ కూడా బాగా పెరుగుతోందని పేపాల్ రీజనల్ మర్చెంట్ సర్వీసెస్ హెడ్ హమిశ్ మోలైన్ పేర్కొన్నారు. ఓయోరూమ్స్ వంటి సంస్థలకు చెల్లింపుల విషయంలో రిస్క్‌ను తగ్గించేలా టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తామని తెలిపారు. వినియోగదారుల చెల్లింపులు సులభంగా, ఎలాంటి రిస్క్‌లు లేకుండా ఉండేందుకు గాను పేపాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయోరూమ్స్ సీఓఓ అభివన్ సిన్హా పేర్కొన్నారు. -
పాస్‌వర్డులను కాప్సుల్లా మింగేయొచ్చు!
ఇంటర్నెట్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌ల పద్ధతి ఇక పాతబడిన విద్యే. మన కంప్యూటర్ మనల్ని గుర్తించేందుకు మన శరీరంలోనే పాస్వర్డ్లు దాగి ఉంటాయనేది రేపటి సాంకేతిక పరిణామం. ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'పేపాల్' ఈ దిశగా కసరత్తును ప్రారంభించింది. కాప్సుల్స్ రూపంలో పాస్‌వర్డ్‌లను, ఇతర మైక్రోచిప్‌లను మింగేసే టెక్నాలజీపై పేపాల్‌కు చెందిన డెవలపర్ జొనాథన్ లెబ్లాంక్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈదిశగా ఇప్పటికే ఆయనెంతో విజయం సాధించారు. ఆయన ఇటీవల తన ప్రయోగాలపై 'కిల్ ఆల్ పాస్వర్డ్స్' పేరిట ఓ ప్రయోగాత్మక ప్రదర్శన ఇచ్చినట్టు 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తెలియజేసింది. ఆయన చర్మం కింద మైక్రోచిప్‌లు, మైక్రోఫోన్స్ అమర్చుకొని వాటి పనితీరును ప్రదర్శించి చూపారు. కాప్సుల్ రూపంలో తయారుచేసిన పాస్వర్డ్, నానోచిప్స్ కలిగిన పరికరాన్ని చూపించారు. ఆ క్యాప్సుల్‌ను మింగేస్తే చాలట. అది మన శరీరంలో భాగమవుతుంది. శరీరంలో అంతర్భాగమైన పాస్‌వర్డ్‌ను కంప్యూటర్ గుర్తిస్తుంది. బ్రెయిన్లో కూడా కంప్యూటర్ చిప్స్‌ను అమర్చుకోవచ్చని, వాటిని పాస్‌వర్డ్‌ల కోసమే కాకుండా ఇతర కంప్యూటర్ అవసరాల కోసం, డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా కూడా పాస్‌వర్డ్‌లను మానవ శరీరంలో భద్రపర్చుకోవచ్చని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, సాంకేతిక పరికరాలను మింగేయొచ్చని, శరీరంలోని రక్తంలో, నరాలతో వాటిని మిళితం చేయొచ్చని లెబ్లాంక్ వివరించారు. ఓ మనిషి గుర్తింపునకు ఆ మనిషి బొటన వేలు ముద్రలు, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ పద్ధతులు ఇక పాతబడినవేనని, మన శరీరంలో కలిసిపోయిన పాస్‌వర్డ్‌లే మన గుర్తింపునకు దోహదపడతాయని వివరించారు. ఇంటర్నెట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు సగటున 16 పాస్వర్డ్లు గుర్తించుకోవాల్సి వస్తుందని, అన్నింటిని గుర్తించలేక సతమతమవుతున్న వారు కూడా ఎక్కువమందే ఉన్నారని, వారి సౌకర్యార్థం ఈ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టినట్టు 'పేపాల్' సంస్థ పేర్కొంది. అయితే మానవ శరీరంలో కలిసిపోయే ఈ సరికొత్త పరికరాలను ఇప్పుడే అందుబాటులోకి తీసుకరావాలనే ఉద్దేశం తమ కంపెనీకి లేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని లెబ్లాంక్ వివరించారు.