సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ బుధవారం భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ చెల్లింపులకు అందుబాటులో పేమెంట్ సంస్థ పే పాల్ ఇకపై భారతీయులు కూడాఅంతర్జాతీయంగా కూడా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ ప్రకటింటింది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారంగా ఉన్న ఆన్ లైన్ ద్వారా ఒకపై పే పాల్ ద్వారా ఒకనుగోళ్లు చేయవచ్చని పేపాల్ హోల్డింగ్స్ ఒకప్రకటనలో తెలిపింది. తద్వారా స్థానిక , ప్రపంచ చెల్లింపులను ప్రాసెస్ చేయగలరని తెలిపింది.భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ సర్వీసులు అందించడం ద్వారా డిజిటల్ ఇండియాలో భాగస్వామ‍్యం కావడం గర్వంగా ఉందని పేపాల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ పాహుజా పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా, వ్యాపార అవకాశాలు మెరుగుపర్చుకునే లక్ష్యంతో తమ మారథాన్ ఇపుడే మొదలైందని పేపాల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రోహన్ మహదేవన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పేపాల్ 218 మిలియన్ల మంది వినియోగదారులతో భారతీయ వినియోగదారుల ఏకీకరణ సాధ్యం మవుతుందున్నారు.
అంటే ఇప్పటిదాకా క్రెడిట్ కార్డు చెల్లింపులను మాత్రమే అంగీకరించిన పేపాల్ ఇకపై భారతీయ డెబిట్ కార్డ్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే...వినియోగదారుల ఫిర్యాదులు కేవలం 30 సెకన్లలో , పెద్ద సమస్య అయితే 5 నిమిషాల్లోనూ పరిష్కరిస్తామని పాహుజా తెలిపారు. అలాగే పే పాల్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసినపుడు... పేమెంట్ పూర్తియినా.. ఆవస్తువు డెలివరీ కాకపోతే ఆరె నెలలు(180 రోజులు) లోపల ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అపుడు నిబంధనల మేరకు ఆ క్యాష్‌న రిఫండ్ చేస్తామన్నారు. అలాగే వస్తువులు కొనుగోలు చేసిన కస్టమర్లు సదరు నగదు చెల్లించకపోతే వ్యాపారుల ప్రయోజనార్థం ఆ బాధ్యతను కూడా పేపాల్ తీసుకుంటుందట.
Comments
Please login to add a commentAdd a comment