పెన్నార్ ఇండస్ట్రీస్ జోరు | Pennar Industries soars 4%, bags orders worth Rs 105 cr | Sakshi
Sakshi News home page

పెన్నార్ ఇండస్ట్రీస్ జోరు

Published Wed, Jun 18 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

Pennar Industries soars 4%, bags orders worth Rs 105 cr

  •   కొత్త ఆర్డర్లతో ఉత్సాహం  
  •   నెలలో 27% ఎగసిన షేరు
  • సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: పెన్నార్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థలు తాజాగా రూ. 105 కోట్లు విలువ చేసే కొత్త ఆర్డర్లు చేజిక్కించుకోవటంతో  బీఎస్‌ఈలో షేర్ ధర 3.40 శాతం పెరిగి రూ. 36.50 వద్ద క్లోజైంది. మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో షేర్ గరిష్ట ధర రూ. 36.85 కాగా కనిష్ట ధర రూ 34.85గా నమోదైంది. గత నెల రోజులుగా షేర్ ధర 27.44 శాతం పెరిగింది. అదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ కేవలం 4.43 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత మూడు నెలలుగా పెన్నార్ షేర్ ధర 75.62 శాతం వృద్ధిని నమోదు చేయగా సెన్సెక్స్ కేవలం 15.5 శాతం మాత్రమే పెరిగింది.
     
    అంటే  మార్కెట్లో సెన్సెక్స్ కన్నా ఐదింతలు జోరును పెన్నార్ షేర్ ప్రదర్శించిందన్న మాట. పెన్నార్ ఇండస్ట్రీస్‌తో పాటు సంస్థ అనుబంధ సంస్థలైన పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్, పెన్నార్ ఎన్విరో లిమిటెడ్ సంస్థలకు అల్ట్రాటెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అభిర్ ఇన్‌ఫ్రా, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బీజీఆర్ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ, ఎస్‌ఆర్‌కే ఇంజినీరింగ్‌ల నుండి తాజా ఆర్డర్లు లభించినట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య రావు తెలిపారు. సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ సిస్టమ్స్ వ్యాపారంలో మంచి వృద్ధి అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
     
    బైబ్యాక్ ఆఫర్...: పెన్నార్ సంస్ధ 40 లక్షల ఈక్విటీ షేర్లను  ఒక్కో షేర్‌ను రూ. 40 చొప్పున బైబ్యాక్ చేసేందుకు గతేడాది జూన్‌లో ఇచ్చిన ఆఫర్ ఈ నెల 9న ముగిసిందని కంపెనీ తెలిపింది. బైబ్యాక్ ద్వారా సంస్థ 16,74,486 షేర్లను కొనుగోలు చేసింది. పెన్నార్ ఇండస్ట్రీస్  ఈక్విటీ క్యాపిటల్ రూ. 60.24 కోట్లు. షేర్ ముఖ విలువ రూ. 5.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement