
ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా అనిల్‌రెడ్డి
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా వెన్నం అనిల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సోమవారం జరిగిన ఫ్యాప్సీ వార్షిక సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మల్లారం అనిల్ రెడ్డి స్వస్థలం.
సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా రవీంద్ర మోదీ..
సూర్య మసాలా బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వ్యవసాయం, పర్యాటకం తదితర విభాగాల చైర్మన్‌గా ఫెడరేషన్‌లో పనిచేశారు.