ఆంధ్రాబ్యాంక్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
కొన్ని మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆంధ్రాబ్యాంక్ షేరు 3.5 శాతం ఎగిసి రూ.62.05 వద్ద ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 16.40 లక్షల షేర్లు (6.98 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.51 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 25 పైసల నుంచి 35 పైసలకు పెరిగింది. ఈ యాక్టివిటీ లాంగ్ బిల్డప్‌ను సూచిస్తున్నది. రూ. 60 స్ట్రయిక్ వద్ద భారీ కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగింది.
కాల్ ఆప్షన్ నుంచి 3.10 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం బిల్డప్ 12.40 లక్షల షేర్లకు తగ్గింది. పుట్ ఆప్షన్‌లో 6.8 లక్షల షేర్లు యాడ్‌కాగా బిల్డప్ 10.90 లక్షల షేర్లకు పెరిగింది. రూ. 65, రూ. 70 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ ఫలితంగా వరుసగా 50 వేలు, 7 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద 13.40 లక్షలు, 17.50 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఆంధ్రాబ్యాంక్ షేరు రూ. 60 సమీపంలో మద్దతు పొందుతూ క్రమేపీ రూ. 65 స్థాయిని అధిగమించవచ్చని, రూ. 60 మద్దతును కోల్పోతే మాత్రం క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.