![బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!: రాజన్](/styles/webp/s3/article_images/2017/09/19/51505242719_625x300.jpg.webp?itok=0wub1s8I)
బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!: రాజన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో తొలుత మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తదుపరే విలీనాల ప్రక్రియ ప్రారంభం కావాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల మూలధన సమస్య పరిష్కారానికి కూడా ఇది కీలకమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన రుణ నాణ్యాతా సమీక్ష (ఏక్యూఆర్) మొండిబకాయిల పరిష్కారంలో కీలక అడుగని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.