న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంచినట్లు వెల్లడించింది.
మార్కెట్లోకి మారుతీ బీఎస్–6 సీఎన్‌జీ ఆల్టో ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు
భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న సీఎన్‌జీ వెర్షన్ ఆల్టో కారును మారుతీ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఆల్టో ఎస్–సీఎన్‌జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ). కిలో సీఎన్‌జీ 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడంలో భాగంగా ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదలచేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేచురల్ గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ముడి చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే కాగా, ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న నేచురల్ గ్యాస్ వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి చేరుకునేలా చర్యలు చేపడుతోంది.
మోడల్ పెరిగిన ధర (రూ.)
ఆల్టో 9,000–6,000
ఎస్–ప్రెస్సో 1,500–8,000
వ్యాగన్‌ఆర్ 1,500–4,000
ఎర్టిగా 4,000–10,000
బాలెనో 3,000–8,000
ఎక్స్‌ఎల్6 5,000
Comments
Please login to add a commentAdd a comment