న్యూఢిల్లీ: త్వరలో విడుదలకానున్న రూ.100 నోటు నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అధికారికంగా ప్రకటించింది. లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న ఈ నోటు వెనుక వైపు గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి ’రాణీ కీ వావ్’ ని ముద్రించింది. 66 ఎంఎంగీ142 ఎంఎం పరిమాణంలో ఉన్న ఈ కొత్త నోటు.. ప్రస్తుతం ఉన్న వంద నోటు కంటే కాస్త చిన్నగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.
మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న వంద నోటు కూడా చెల్లుతుందని స్పష్టంచేసిన ఆర్‌బీఐ పాత నోటు సైజు 73 ఎంఎంగీ157 ఎంఎంగా ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే బ్యాంకుల ద్వారా కొత్త వంద నోటు అందుబాటులోకి రానుందని, ముద్రణ ఆధారంగా క్రమంగా విడుదల పెరుగుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment