Rs 100 notes
-
పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయా?
పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ నోట్లు రద్దవుతాయంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు. పాత రూ.100 నోటు ఇస్తే తీసుకోవడం లేదంటూ మరికొందరు పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ యూజర్ పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయని, 2024 మార్చి 31 వరకు పాత రూ.100 నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించిందని పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా దుకాణదారులు పాత రూ.100 నోటు తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన మరో యూజర్ పేర్కొన్నారు. ఈ పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. @RBI Today, in Ameerpet, Telangana, I encountered an issue where a Pani Puri vendor declined to accept a Rs. 100 note, Could you kindly provide clarification on whether there are any considerations or guidelines regarding the acceptance of such notes in the market? pic.twitter.com/x4c3ONhX0O — Anil G (@anilbjpofficial) December 27, 2023 అయితే పాత వంద రూపాయల నోట్లు నిజంగానే రద్దవుతున్నాయా.. ఆర్బీఐ అలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చిందా అని పరిశీలించగా ఇవన్నీ ఫేక్ వార్తలని తేలింది. ఇందులో వాస్తవం లేదని ఆర్బీఐ ప్రతినిధి స్పష్టం చేశారు. Yogesh Dayal, the spokesperson for RBI, dismissed the viral claims about the withdrawal of the old Rs 100 notes. https://t.co/sXbIBl92VC pic.twitter.com/SzSARAypZ5 — The Quint (@TheQuint) December 26, 2023 -
పాత రూ.100 నోట్ల రద్దు: కేంద్రం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి-ఏప్రిల్ నాటికి పాత కరెన్సీ నోట్ల రూ.100, రూ.10, రూ.5ను చలామణి నుంచి శాశ్వతంగా తొలగిపోనున్నాయనే వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత వంద, పది, ఐదు రూపాయల నోట్లు రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ.100, రూ.10, రూ.5ల పాత సిరీస్ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని ట్వీట్ చేసింది. మరోవైపు ఆర్బీఐ ప్రతినిధి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఈ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) కాగా, ఒక సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) మహేష్ మాట్లాడుతూ ఆర్బీఐ త్వరలోనే పాత కరెన్సీ నోట్లు రూ.100, రూ.10, రూ.5 రద్దు చేయనుందని, ఈ నేపథ్యంలో 2021 మార్చి నుంచి ఈ నోట్లు చలామణిలో ఉండవని ప్రకటించారన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తాజా వివరణతో ఊరట లభించింది. एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3 — PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021 -
లావెండర్ రంగులో కొత్త వంద రూపాయల నోటు..
-
‘వావ్’.. వంద నోటు!
న్యూఢిల్లీ: త్వరలో విడుదలకానున్న రూ.100 నోటు నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అధికారికంగా ప్రకటించింది. లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న ఈ నోటు వెనుక వైపు గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి ’రాణీ కీ వావ్’ ని ముద్రించింది. 66 ఎంఎంగీ142 ఎంఎం పరిమాణంలో ఉన్న ఈ కొత్త నోటు.. ప్రస్తుతం ఉన్న వంద నోటు కంటే కాస్త చిన్నగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న వంద నోటు కూడా చెల్లుతుందని స్పష్టంచేసిన ఆర్బీఐ పాత నోటు సైజు 73 ఎంఎంగీ157 ఎంఎంగా ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే బ్యాంకుల ద్వారా కొత్త వంద నోటు అందుబాటులోకి రానుందని, ముద్రణ ఆధారంగా క్రమంగా విడుదల పెరుగుతుందని తెలిపింది. -
కొత్త 100 రూపాయల నోటు, భలే ఉంది!
న్యూఢిల్లీ : గులాబీ రంగులో 2000 రూపాయల నోటు.. పసుపు రంగులో 200 రూపాయల నోటు.. ఆకుపచ్చ రంగులో 50 రూపాయల నోటు.. చాక్లెట్ రంగులో 10 రూపాయల నోటు.. ఇలా విభిన్న రంగుల్లో కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు తర్వాత నకిలీలకు తావులేకుండా ఈ నోట్లలో సెక్యురిటీని మరింత పెంచుతూ తీసుకొచ్చింది. తాజాగా వంద రూపాయల కొత్త నోటును కూడా ఆర్బీఐ తీసుకొస్తోందట. వచ్చే నెలలో ఈ కొత్త నోటును ప్రవేశపెట్టబోతుందని ‘బిజినెస్ న్యూస్’ రిపోర్టు చేసింది. ఈ నోటు ముదురు నీలం రంగులో ఉంటుందని తెలిపింది. కొత్త వంద రూపాయల నోట్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద రూపాయల నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త రూ.100 నోటుకు ప్రింటింగ్ ప్రెస్ వద్ద తుది ఆమోదం లభించిందని, రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసే దగ్గరే, ఈ కొత్త వంద రూపాయల నోట్లను ప్రింట్ చేస్తున్నట్టు బిజినెస్ న్యూస్ రిపోర్టు చేసింది. విదేశీ ఇంక్‌తో దివాస్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఈ నోట్ల ప్రింటింగ్ కూడా ప్రారంభమైందట. కొత్త నోట్లకు అనుగుణంగా బ్యాంకులు తమ ఏటీఎంలలో మార్పులు కూడా చేపడుతున్నాయని తెలిసింది. కాగా, 2017 ఆగస్టులోనే ఆర్బీఐ కొత్త 200 రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు మార్కెట్లోకి వచ్చింది. దేవనాగరి లిపిలో రూ 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు. -
రూ.100 నోట్లు సిద్ధంగా ఉన్నాయ్..!
ముంబై: బ్లాక్ మనీపై దేశ ప్రధానమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చురుగ్గా కదులుతోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దుపై ఆందోళన చెందాల్సి అవసరం లేదన్న సంకేతాలు అందించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తమ అన్ని బ్రాంచ్ లోలనూ, ఏటీ ఎం కేంద్రాలలోనూ సరిపడినన్ని 100 రూపాయల నోట్ల నిల్వలు రడీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11 నుంచి ఏటీఎం కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు రేపు (గురువారం) సెలవు పాటిస్తుండగా, సాయంత్రం ఆరుగంటల వరకు తమ బ్యాంకులు పని చేస్తాయని, 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. అలాగే తమ ఖాతాల్లో రూ.500, రూ. 1000 నోట్ల డిపాజిట్లకు ఎలాంటి లిమిట్ లేదని వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయంతో తాజాగా 100 నోటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దు చేయడంతో ప్రజల్లో రూ.100 నోటుపై విపరీతమైన క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.