ముంబైః రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున డివిడెండ్ చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 66 వేల కోట్ల రూపాయల డివిడెండ్ను బ్యాంక్ గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. సెంట్రల్ బ్యాంక్ స్థాపించిన తరువాత గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్టు ఎక్కువ. 80 ఏళ్ల బ్యాంకు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డివిడెండ్ చెల్లించడం ఇదే మొదటిసారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కిందటి ఏడాది కంటే దాదాపు 22 శాతం ఎక్కువ. ఫిస్కల్ డెఫిసెట్ టార్గెట్లను అధిగమించడానికి ఆర్బీఐ చెల్లించిన ఈ డివిడెండ్ మంచి తోడ్పాటు ఇస్తుందని ఆర్థికవేత్తలంటున్నారు. మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థ అభివృద్దికి ఈ చెల్లింపులు తోడ్పడతాయని భావిస్తున్నారు.
80 ఏళ్లలో తొలిసారి..
Published Fri, Aug 14 2015 11:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement