ఆర్‌బీఎల్ బ్యాంక్ లాభం 55 శాతం అప్
ఒక్కో షేర్‌కు రూ.1.80 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఆర్‌బీఎల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.130 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.84 కోట్లు)తో పోల్చితే 55 శాతం వృద్ధి సాధించామని ఆర్‌బీఎల్ బ్యాంక్ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.1.80 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.292 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 53 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.3,235 కోట్ల నుంచి రూ.4,469 కోట్లకు ఎగసిందని వివరించింది.