
ముంబై: రికవరీ ఏజెంట్లకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకుగాను ఆర్‌బీఎల్ బ్యాంక్ లిమిటెడ్‌పై 2.27 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. 2018–19 నుండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి మధ్య కాలానికి సంబంధించి ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.
వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను, పలు సహకార బ్యాంకులపై కూడా సెంట్రల్ బ్యాంక్ జరిమానా విధించింది. వీటిలో లోక్‌మంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (షోలాపూర్), జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్ (రైసెన్) స్మృతి నాగ్రిక్ సహకారి బ్యాంక్ (మర్యాదిత్, మందసౌర్) రాయగఢ్ సహకరి బ్యాంక్ (ముంబై) నోబుల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (నోయిడా), ఇంపీరియల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (జలంధర్) ఉన్నాయి.