రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.417 కోట్లు | Reliance Capital Q4 net at Rs 417 crore | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.417 కోట్లు

Published Fri, Apr 28 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

రిలయన్స్‌ క్యాపిటల్‌  లాభం రూ.417 కోట్లు

రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.417 కోట్లు

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.417 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.415 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,828 కోట్ల నుంచి 80 శాతం వృద్ధి చెంది రూ.5,086 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

 ఒక్కో షేర్‌కు రూ.10.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.1,101 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,086  కోట్లు చొప్పున నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.9,9998  కోట్ల నుంచి రూ.17,640 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్‌ 4.5 శాతం లాభంతో రూ.670 వద్ద ముగిసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement