దొడ్డిదారి ఆపరేటర్ వ్యాఖ్యలపై మండిపడ్డ జియో..
ఆ మాటలు కోర్టు ధిక్కరణే
న్యూఢిల్లీ: బ్యాక్ డోర్ ఆపరేటర్ (దొడ్డిదారిలో వచ్చిన) అంటూ రిలయన్స్ జియోను ఉద్దేశించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) చేసిన వ్యాఖ్యలపై జియో మండిపడింది. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిందని, ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ జియో బ్యాక్ డోర్ ఆపరేటర్ అని, మరో సంస్థను ముందుంచి లెసైన్స్‌ను సంపాదించిందంటూ సీఓఏఐ చేసిన ఆరోపణలను తప్పుబట్టింది. ‘సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ ప్రకటన అక్రమమైది. అపఖ్యాతి పాల్జేసేది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించేది’ అని జియో పేర్కొంది. దీనిపై ఇప్పటికే మాథ్యూస్ నుంచి క్షమాపణలు కోరామని తెలిపింది.