![Reliance Jio widens subscribers base - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/17/JIO.jpg.webp?itok=l8jNuuGy)
న్యూఢిల్లీ: సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ Výæణాంకాల ప్రకారం.. గతేడాది నవంబర్ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందాదారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment