number of subscribers
-
అగ్రస్థానానికి జియో
న్యూఢిల్లీ: సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ Výæణాంకాల ప్రకారం.. గతేడాది నవంబర్ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందాదారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది. -
జియోకి 4 కోట్ల యూజర్లు!
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ముంబై: రిలయన్స్ జియో సబ్స్క్రైబర్ల సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు చేరుతుందని ప్రముఖ మర్చంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. 2017-18లో జియో వల్ల రియలన్స్ ఇండస్ట్రీస్‌కు 2 బిలియన్ డాలర్లమేర ఆదాయం లభిస్తుందని అభిప్రాయపడింది. ఇది డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా వేసింది. ఒక యూజర్ నుంచి సగటున రూ.300 ఆదాయం పొందుతుందని తెలిపింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోకి 21 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేసింది.