అదానీ జరిమానా రద్దు చేయలేదు | Reports on waiver of Rs 200 crore fine on APSEZ 'incorrect': Government | Sakshi
Sakshi News home page

అదానీ జరిమానా రద్దు చేయలేదు

Published Mon, Jul 4 2016 12:46 PM | Last Updated on Fri, Aug 17 2018 2:39 PM

అదానీ జరిమానా రద్దు చేయలేదు - Sakshi

అదానీ జరిమానా రద్దు చేయలేదు

న్యూఢిల్లీ:  ముద్రాపోర్ట్ నిర్మాణ సమయంలో అదానీ పోర్ట్ సెజ్ లిమిటెడ్  పై విధించిన భారీ జరిమానాను రద్దుచేసి  ఎన్డీయే ప్రభుత్వం అదానీ కి భారీ ఊరట నిచ్చిందనే వార్తలపై   కేంద్రం స్పందించింది.  పర్యావరణ నష్టం కింద అదానీకి విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రద్దుచేసిందనే వార్తను   పర్యావరణ శాఖ ఖండించింది.  అది  "తప్పు"  వార్తని  మంత్రిత్వ శాఖ కొట్టి పారేసింది.   నష్టనివారణ కోసం, పర్యావరణ పునరుద్ధరణ  పరిరక్షణ కోసం సునీతా నారాయణ్ కమిటీ  ప్రతిపాదించిన రూ .200 కోట్ల జరిమానాను అదానీ భరించాల్సిందేనని  తేల్చి చెప్పింది.   జరిమానా రద్దు కాలేదని  ప్రకటించడంతో పాటూ, ఈ వ్యవహారంలో ప్రభుత్వం  చాలా సీరియస్ గా ఉందని మంత్రిత్వ శాఖస్పష్టం చేసింది.

పునరుద్ధరణ నిధికి రూ .200 కోట్ల గ్రీన్ పెనాల్టీపై  వెనక్కి లేదని స్పష్టం చేసింది.  ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు అదానీపై మరింత  తీవ్రమైన బాధ్యతను పెట్టినట్టు వివరించింది. దీనికితోడు  ఈ జరిమానా వసూలు ప్రక్రియలో  చట్టబద్దమైన చర్యలకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా నోటీసులు జారీ  చేశామని తెలిపింది. 

 కాగా  ముద్రా ప్రాజెక్టు సైట్ పర్యావరణకు నష్టం చేకూరుస్తుందనే ఆరోపణలను కాంగ్రెస్ హయాంలో అదానీ ఎదుర్కొంది.  దీనిపై విధించిన సునీతా నారాయణ్  కమిటీ ప్రతిపాదనలను 2013లో అప్పటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పర్యావరణానికి ముప్పు కల్గించినందుకు గ్రీన్ పెనాల్టీ కింద అదానీకి రూ.200 కోట్ల డాలర్లు లేదా ప్రాజెక్టు ధరల్లో 1శాతం ఏది ఎక్కువైతే అది జరిమానా చెల్లించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే యూపీఏ హయాంలో అతిపెద్ద గ్రీన్ పెనాల్టీనీ ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసిందనీ, అదేవిధంగా 2009లో గుజరాత్ లో కంపెనీ వాటర్  పోర్ట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు జారీచేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ను పొడిగించి, అదానీ భారీ ఊరట కల్పించిందని  వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement