ముంబై : వడ్డీ రేట్లు దిగివచ్చేలా ఆర్‌బీఐ రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్ అంచనా 4 శాతం కంటే దిగువనే ఉండటంతో వడ్డీరేట్లలో కోత విధించవచ్చని పరిశ్రమ,మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్‌బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment