టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు | Ringo slams telcos for not providing interconnect points for internet | Sakshi
Sakshi News home page

టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు

Published Fri, Oct 14 2016 1:27 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు - Sakshi

టెలికం ఆపరేటర్లపై రింగో ఆరోపణలు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ సేవల యాప్ ‘రింగో’ తన నెట్‌వర్క్‌కు టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ ఇంటర్‌కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసింది. దీనిపై ఆపరేటర్లకు లేఖలు రాయగా ఎలాంటి స్పందన  లేదని, ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేశామని రింగో సీఈవో భవీన్ తురాఖియా చెప్పారు.

బీఎస్‌ఎన్‌ఎల్ మినహా మిగిలిన ఆపరేటర్లు ఇంటర్ కనెక్షన్‌కు అవకాశం కల్పించడం లేదన్నారు. విమొబి అనే తమ సబ్సిడరీ ద్వారా ఫిబ్రవరిలో యూనిఫైడ్ లెసైన్స్ తీసుకున్నామని,   అయితే  ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు ప్రారంభించకుండా ఉంటేనే మా నెట్‌వర్క్‌కు ఇంటర్ కనెక్షన్ కల్పిస్తామని ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు చెప్పాయని వివరించారు.

నిమిషానికి 20పైసలే: ప్రస్తుతం వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి రూపాయిన్నర వరకు కంపెనీలు వసూలు చేస్తున్నాయని, తాము 20 నుంచి 35 పైసలకే అందిస్తామన్నారు. లేవాస్తవానికి రింగో తన చౌక యాప్ కాలింగ్ సేవలను 2015 నవంబర్‌లోనే ప్రారంభించింది. 90 శాతం చౌకగా కాల్స్ అందిస్తుండడంతో టెలికం ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ట్రాయ్ సూచన మేరకు రింగో తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. రింగో మొబైల్ యాప్ యాప్ 3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై, వైఫై మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఈ యాప్ కస్టమర్లను వారి మొబైల్ నంబర్ ఆధారంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తుంది. దీంతో దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌కు అయినా కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement