![Role of rating agencies is crucial: RBI governor - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/9/Untitled-16.jpg.webp?itok=elCbqAnO)
ముంబై: ఫైనాన్షియల్ రంగ స్థిరత్వంలో... అవి సమర్థంగా పనిచేయడంలో రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భాగస్వాములతో సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ఉన్నతోద్యోగులతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశమై చర్చించారు. ‘‘ఫైనాన్షియల్ సెక్టార్ సమర్థవంతంగా, సుస్థిరంగా పనిచేయడంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భాగస్వాముల సంప్రతింపుల్లో భాగంగా గురువారం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ఎండీ, సీఈవోలతో సమావేశమయ్యాను’’ అంటూ శక్తికాంతదాస్ ట్వీట్ చేశారు. కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్ మొండి బకాయిలను సమయానికి గుర్తించడంలో విఫలమయ్యాయంటూ రేటింగ్ ఏజెన్సీలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment