న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50,000కోట్లకు పైగా నిధుల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. వ్యాపార వృద్ధికితోడు, నియంత్రణల పరంగా అంతర్జాతీయ నిబంధనలను చేరుకునేందుకు నిధుల సమీకరణ తలపెట్టాయి. ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపార అవసరాలకు బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
21 పీఎస్‌బీల్లో 13బ్యాంకుల బోర్డులు ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణకు ఆమోదం తీసుకున్నాయి. ఈ బ్యాంకుల ఉమ్మడి నిధుల సమీకరణ రూ.50వేల కోట్లకుపైగా ఉంది. సెంట్రల్ బ్యాంకు రూ.8,000 కోట్లు, కెనరా బ్యాంకు రూ.7,000 కోట్లు, బీఓబీ రూ.6,000 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఓబీసీ, కార్పొరేషన్ బ్యాంకు, దేనా, యూకో అలహాబాద్ బ్యాంకు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment