సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ల బలహీనం, డాలరు స్థిరత్వం నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి నష్టాల్లో ముగిసింది. డాలరు మారకంలో ఆరంభంలో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 76.17 కు చేరింది. చివరకు 19 పైసలు క్షీణించి 76.03 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 28 తర్వాత దేశీయ కరెన్సీ తొలిసారిగా 76 స్థాయిని అధిగమించింది. శుక్రవారం రూపాయి 75.84 వద్ద ముగిసింది.
కరోనా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట పడలేదన్న ఆందోళనకు తోడు వ్యాక్సిన్ ఆలస్యంలాంటివి సెంటిమెంట్ ను బలహీనపర్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అనిశ్చితి కారణంగా రూపాయి 76.50 స్థాయికి చేరవచ్చని 75.50 వద్ద కీలకమైన మద్దతు ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. బ్యారెల్ ధర 35.59కు చేరింది. గోల్డ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 1721 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో బలహీనత కొనసాగుతోంది. సెన్సెక్స్ 424 పాయింట్ల నష్టంతో 33352 వద్ద, నిఫ్టీ119 పాయింట్లు కోల్పోయి 9853 వద్ద కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment