weakness
-
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్‌తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది: ఖర్గే
త్రిస్సూర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమబద్ధంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి విభాగాలను ఆయుధాలుగా వాడుకుంటోందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గాను ఆదివారం ఆయన కేరళ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. త్రిస్సూర్‌లోని తెక్కునాడు మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘మహాజన సభ’నుద్దేశించి మాట్లాడారు. సమావేశంలో 25వేలకు పైగా బూత్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బ ణం విపరీతంగా పెరిగాయని, దేశంలో పేద, ధనిక అంతరాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. -
అన్నీ మనసులోనే ఉంచుకుంటున్నారా?
అంతర్ముఖుల శక్తి వారి నిశ్శబ్దంలోనే ఉంటుంది. కాని అదే వారి బలహీనత కూడా కావచ్చు. అంతర్ముఖత్వం వల్ల కచ్చితంగా చెప్పాల్సినవి చెప్పకపోవచ్చు. మనసులో ఏముందో ఎదుటివారికి తెలియకపోవడం వల్ల అనుకోని సమస్యలు రావచ్చు. అంతర్ముఖులుగా ఉన్న స్త్రీలు తమ కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవనంలో ఎలా మెలగాలో తెలుసుకుందాం. కొందరు అన్నింటికీ స్పందిస్తారు. కొందరు మౌనంగా ఉంటారు. కొందరిని చూసి ఇతరులు ‘వాళ్లు మనసులో ఏమీ దాచుకోరు’ అంటారు. మరికొందరిని చూసి ‘వీళ్ల మనసులో ఏముందో తెలుసుకోలేము’ అంటారు. బహిర్ముఖులదే (ఎక్స్ట్రావర్ట్స్) ఈ లోకం అని ఎక్కువ మంది విశ్వాసం. ఎందుకంటే తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడి నలుగురి దృష్టిని ఆకర్షించేవాళ్లే గెలుపు సాధిస్తారని ఎక్కువమంది అభిప్రాయం. అలా కాకుండా కేవలం తమ పని ఏదో తాము చేసుకుంటూ అవసరమైతే తప్ప తమ అభిప్రాయాలను వెల్లడించని అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్) సాధించే విజయాలు తక్కువ కాదు. ఇవాళ (జనవరి 2) ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవం. మీరు అంతర్ముఖులా? ఎలా తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు ‘అవును’/ ‘కాదు’లలో ఏది చెప్పగలరో చూడండి. 1. మీరు గుంపులో ఉండటానికి ఇష్టపడరా? 2. చాడీలు, పుకార్లు కాకుండా మీకు ఇష్టమైన అంశం గురించే మాట్లాడటానికి ఇష్టపడతారా? 3. మీ చిన్నప్పుడు బంధువులొచ్చినా, ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా మీరెక్కడున్నారో తెలియనట్టు మసలేవారా? 4. అప్పుడప్పుడు ఒంటరిగా మీ ఆలోచనల్లో మీరుండాలనిపిస్తుందా? 5. మీకు తక్కువగా, మృదువుగా మాట్లాడే మనిషి అనే పేరుందా? వీటి జవాబులు ‘అవును’ అయితే మీరు ఇంట్రావర్ట్ కిందే లెక్క. అయితే మానసిక నిపుణుల ప్రకారం ఎవరూ పూర్తిగా అంతర్ముఖత్వంతో, పూర్తిగా బహిర్ముఖత్వంతో ఉండరు. ఇరు స్వభావాలూ అందరిలో ఉంటాయి. అయితే ఒకటి ఎక్కువ పాళ్లల్లో ఉంటుంది. అంతర్ముఖత్వం ఎక్కువ పాళ్లల్లో ఉంటే మీరు అంతర్ముఖుల కిందే లెక్క. ఇవీ ప్లస్ పాయింట్స్ అంతర్ముఖులు తమ లోపలి నుంచి తాము శక్తిని పొందుతారు. వీరు ఎప్పుడూ తమ మనోభావాలను, ఆలోచనలను గమనించుకుంటూ ఉంటారు. నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకుని సరి చేసుకుంటూ ఉంటారు. ఒక పని మీద లక్ష్యం ఉంటుంది. చాలామటుకు నిరుపయోగమైన పనుల్లో కాలం వృథా చేయరు. మైనస్ పాయింట్స్ ఏ పనైనా సమర్థంగా చేయగలిగే శక్తి, నైపుణ్యం, ప్రతిభా ఉన్నా అది చేతలతో మాత్రమే చూపుతారు. మాటల వల్ల తెలియచేసి ముందుగా అవకాశం దొరకబుచ్చుకోరు. ఒకరిని పొగడటం, ఒకరితో పొగడ్త వినడం వీరికి దాదాపుగా రాదు. గుంపులను ఇష్టపడరు. వీరి నిశ్శబ్దాన్ని ఎదుటివారు పొగరుగా, నిర్లక్ష్యంగా భావించవచ్చు. నలుగురినీ తమ మాటలతో ఆకర్షించే ఎక్స్ట్రావర్ట్స్ను చూసి, వీరు అలా ఉండకపోవడం లోపమేమో అని బాధపడవచ్చు. స్త్రీలు ఇంట్రోవర్ట్స్ అయినప్పుడు ప్రపంచంలో బహిర్ముఖులు ఎంతమందో అంతర్ముఖులు అంతమంది ఉంటారు. అమ్మాయిలు తమ బాల్యంలో ఇంట్రోవర్ట్లుగా ఉంటే వీరికి తక్కువమంది స్నేహితులయ్యే అవకాశం ఉంది. తల్లితో, తోబుట్టువులతో తప్ప ఎక్కువమందితో మాట్లాడకపోవచ్చు. కాలేజీలో ఇలాంటి వారు కాలేజీలో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగాల్లో వీరు చెప్పిన పని చేసుకునిపోయే వారవుతారు. గృహిణిగా ఎక్కువ మౌనంతో, తక్కువ మాటలతో సంసారాన్ని నిర్వహిస్తారు. అయితే వీటివల్ల ఏ నష్టమూ లేకపోయినా అనేక విషయాలు వీరికి నచ్చనప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వారు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారో ఎదుటివారికి తెలియక సతమతమయ్యే స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిగతంగా, పిల్లల భవిష్యత్తు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి నిర్ణయం బాగా ఆలస్యమయ్యి లేదా వెంటనే తేలక చిక్కులు రావచ్చు. ఏం చేయాలి? సుసాన్ కెయిన్ అనే అమెరికన్ రచయిత్రి ‘క్వైట్: పవర్ ఆఫ్ ఇంట్రావర్ట్’ అనే పుస్తకం రాసింది. అంతర్ముఖుల మౌనంలోనే వారి శక్తి ఉంటుంది. అదే సమయంలో భర్తతో/పిల్లలతో/ ఆఫీసు పరివారంతో కచ్చితమైన అభిప్రాయాలు వెల్లడి చేయాల్సి వచ్చినప్పుడు తప్పక వెల్లడి చేయాలి. ఇంట్లో కాసేపు ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ‘అలక/కోపం’ అనే భావన ఇతరులకు కలగకుండా ‘కాసేపు పుస్తకం చదువుకుంటాను’ అని చెప్పి ఏదో ఒక పుస్తకం పట్టుకుని గదిలో మీ ఆలోచనల్లో మీరు నిమగ్నం కావచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడినప్పుడు మీరు తక్కువ మాట్లాడినా పూర్తి సమయం వారి సమక్షంలో ఉండేలా చూసుకోవాలి. -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
ఫెడ్ నిర్ణయాలు... ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, స్థూల ఆర్థిక, ఆక్టోబర్ ఆటో అమ్మక గణాంకాలు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. గురువారం దీపావళీ, శుక్రవారం బలి ప్రతిపద సందర్భంగా ఎక్చ్సేంజీలకు సెలవుకావడంతో ట్రేడింగ్ మూడు రోజులే జరుగుతుంది. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ సమావేశానికి ముందు అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. మూడురోజుల పరిమిత ట్రేడింగ్‌లో అమ్మకాలు కొనసాగవచ్చు. నిఫ్టీకి 17,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయి ఉంది. నిర్ణయాత్మక ఈ స్థాయిని కోల్పోతే అమ్మకా తీవ్రత మరింత పెరగవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ద్ ఖేమా తెలిపారు. గతవారంలో సెన్సెక్స్ 1,515 పాయింట్లు, నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాల ప్రకటన, ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., నేడు వాహన విక్రయ గణాంకాల వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు నేడు(సోమవారం) తమ అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడయ్యే అవకాశం ఉంది. సెమి కండెక్టర్ల కొరత, రవాణా ఛార్జీలు, ముడి సరుకు ధరల పెరుగుదల తదితర అంశాలు వాహన విక్రయాలను పరిమితం చేసి ఉండొచ్చని పరిశమ్ర నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(నవంబర్ 2న) మొదలై.., మూడో తేదిన(బుధవారం)ముగియనున్నాయి. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ఆర్థిక ఉద్దీపనల ఉపసంహరణ(ఫెడ్ ట్యాపరింగ్), బాండ్ల క్రయవిక్రయాలపై కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ నవంబర్ మొదటి వారంలోనూ కొనసాగనుంది. హెచ్డీఎఫ్సీ, టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, దివీస్ ల్యాబ్స్, ఐఆర్సీటీసీలతో సహా 350కి పైగా కంపెనీలు ఈ వారంలో తమ సెప్టెంబర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. గతవారంలో కార్పొరేట్ల క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గురువారం ముహురత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., ఆ రోజు సాయం త్రం ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్ 06:00 – 06:08 మధ్య ప్రారంభమవుతుంది. ప్రధాన సెషన్ 06:15 నుంచి 07:15 నిర్వహించబడుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నిర్ధిష్ట సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని ట్రేడర్ల విశ్వాసం. ఈ వారంలో మూడు ఐపీఓలు మూడు కంపెనీలు ఈ వారంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. పాలసీ బజార్, సంఘీ ఇండస్ట్రీస్, జేఎస్ఎస్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు సోమవారం మొదలైన బుధవారం ముగియనున్నాయి. ఇందులో పాలసీ బజార్ రూ. 5,625 కోట్లను, ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్ రూ.800 కోట్లను, సంఘీ ఇండస్ట్రీస్ రూ.125 కోట్ల నిధుల సమీకరించున్నాయి. అలాగే గతవారం ప్రారంభమైన నైకా, ఫినో పేమేంట్స్ బ్యాంక్ ఐపీఓలు మంగళవారం ముగియనున్నాయి. అక్టోబర్‌లో అమ్మేశారు రెండు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో దేశీయ ఈక్విటీలను అమ్మేశారు. గత నెలలో భారత మార్కెట్ నుంచి రూ.12,278 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,550 కోట్ల షేర్లను విక్రయించగా.., డెట్ మార్కెట్లో రూ.1,272 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిట రీ గణాంకాలు తెలిపాయి. ‘‘షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే నెపంతో మిర్లేంచ్, యూఎస్బీ, నోమురా బ్రోకరేజ్ సంస్థలు భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు ఇదొక కార ణం అయ్యిండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
మొదటిసారి నిందితుడిని చూస్తే అది బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్‌ల ధర్మాసనం ఈ∙వ్యాఖ్యలు చేసింది. నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్టేషన్ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
పెద్దవయసు పిల్లలూ చొల్లు కార్చుకుంటున్నారా?
పిల్లల్లో నోటి నుంచి చొల్లు కారడం చాలా సహజంగా కనిపించే లక్షణం. ఇలా చొల్లు/జొల్లు కారుతూ ఉన్న కండిషన్‌ను సైలోరియా అంటారు. ఇది 6 నుంచి 18 నెలల వరకు సాధారణంగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో అలా చొల్లు కారడాన్ని సాధారణంగానే పరిగణించవచ్చు. నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం కారుతుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు కారుతుంటే దాన్ని అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన రుగ్మతలు ఉంటే ఈ లక్షణం కనిపిస్తుంటుంది. కారణం... వాళ్లలో నోట్లో స్రవించిన లాలాజలాన్ని తమంతట తామే మింగలేని పరిస్థితి ఉంటుంది. చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేకపోవడానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) కూడా చొల్లు/జొల్లు కారుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నపుడు జొల్లు కారవడం ఎక్కువవుతుంది. కాని ఇవన్నీ తాత్కాలికం. పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు/జొల్లు కారడం సమస్య ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే లాలాజల స్రావాన్ని మింగేలా అలవాటు చేయాలి. ఇలా లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా మింగడం అలవాటు చేయించవచ్చు. మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం టాక్సిమ్ అనే పదార్థాన్ని లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేయడం కూడా చేస్తున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... ♦ మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) ♦ తరచూ మింగడం అలవాటు చేయడం ♦ నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ ఇలా చొల్లు/జొల్లు కారకుండా చేసేందుకు దోహదపడతాయి. -
క్యాన్సర్ నిస్సత్తువను జయిద్దాం రండి!
క్యాన్సర్ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్ వ్యాధి కారణంగానూ, చికిత్సతోనూ వచ్చే తీవ్రమైన నిస్సత్తువ. వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రమైన నీరసం అనుక్షణం కుంగదీస్తూ ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండనివ్వదు. ఈ నీరసం నిస్సత్తువ, అలసటగా అనిపించే భావన రోగిని మందకొడిగా చేసి... కొన్నిసార్లు మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దాంతో క్యాన్సర్‌పై పోరు కంటే... ఈ నిస్సత్తువతో పోరే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది రోగులు తొలుత కాస్త కుంగిపోయినా... క్రమంగా తమ మానసిక బలాన్ని కోల్పోని వారు క్యాన్సర్ పోరుపై తప్పక విజయం సాధిస్తారు. డిసెంబరు నెలను ‘క్యాన్సర్ ఫెటీగ్ అవేర్నెస్ మాసం’ గా పేర్కొంటారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్)పై అవగాహన, వాటిని అధిగమించే తీరుతెన్నులను తెలుసుకుని, వ్యాధిపై విజయం సాధించడం కోసం ఉపయోగపడేందుకే ఈ కథనం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. కానీ చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. దీనివల్ల కలిగిన వ్యాకులత, కుంగుబాటు వల్ల రోగి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగి తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేడు. దాంతో జీవితాన్ని ఆస్వాదించలేడు. ఈ నిస్సత్తువకు చాలా కారణాలే ఉంటాయి. నిర్దిష్టంగా ఫలానా అంశమే దీనికి కారణం అని చెప్పడానికి వీలుకాదు. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి కరవవుతుంది. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. ఆ కారణాలనూ, మార్గాలను చూద్దాం. కారణాలు రక్తహీనత (అనీమియా): అనీమియా అనే కండిషన్ క్యాన్సర్ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణం. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో (అందునా ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లలో) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఈ ఎర్రరక్తకణాలే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను తీసుకెళ్తాయన్న విషయం తెలిసిందే. దాంతో కణాలకు అందే ఆక్సిజన్ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. శరీరంలో విషాలు తొలగకపోవడం: ఆక్సిజన్ అందించడంతో పాటు ఎర్రరక్తకణాలు దేహంలో తయారైన కార్బన్డయాక్సైడ్, ఇతర విషాల (టాక్సిన్స్)ను బయటకు పంపుతాయి. కానీ ఎర్రరక్తకణాలు తగ్గడంతో కణానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు బయటకు విసర్జించాల్సిన విషాలను తీసుకెళ్లే సామర్థ్యమూ తగ్గుతుంది. దేహంలో ఉండిపోయిన ఈ విషాలు జీవక్రియలకు ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఫలితంగా రోగిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. రోగి ఎప్పుడూ అలసట తో ఉన్నట్లుగా ఉంటాడు. బ్లడ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి సాధారణం. క్యాన్సర్ చికిత్సల వల్ల : కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సల కారణంగానూ, బోన్ మ్యారో క్యాన్సర్లకు అందించే మందుల కారణంగా కూడా రోగుల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల్లో భాగంగా క్యాన్సర్ కణాల్ని తుదముట్టించడానికి టార్గెట్ చేస్తున్నప్పుడు... ఆరోగ్యవంతమైన కణాలు కూడా అంతో ఇంతో దెబ్బతినడం జరుగుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ రోగుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో చికిత్సలో కలిగే నొప్పి, యాంగై్జటీ/ డిప్రెషన్‌కు గురికావడం, మందకొడిగా ఉండాల్సిరావడం (ఇనాక్టివిటీ), తరచూ నిద్రాభంగం కావడం, నిద్రలో అంతరాయాలు, సరిగా భోజనం తీసుకోకపోవడం వంటివి కూడా నీసరం, నిస్సత్తువకు కారణమవుతాయి. ► అధిగమించడం ఇలా ... నీరసం, నిస్సత్తువ ఉన్నప్పటికీ తొలి దశల్లో మనోబలంతో క్రమంగా మంచి ఆహారానికీ, క్రమబద్ధంగా వ్యాయామానికీ ఉపక్రమించడంతో ‘క్యాన్సర్ ఫెటీగ్’ను అధిగమించవచ్చు. క్రియాశీలంగా ఉండటం (ఇంక్రీజింగ్ యాక్టివిటీ) : రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు లొంగిపోకుండా... ఎంతోకొంత చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అలసట కలిగించని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ఉపక్రమించాలి. దాంతో దేహంలోనూ, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు స్రవిస్తాయి. ఫలితంగా మూడ్స్ కూడా మెరుగుపడతాయి. రోగిలో సంతోషభావనలు కలుగుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్ : క్యాన్సర్ రోగుల్లో చాలామంది తమ బరువు కోల్పోయి... చాలా సన్నబడతారు. రోగులు తమ వ్యాకులత కారణంగా తినకపోవడంతో పాటు... చికిత్సలో భాగంగా కనిపించే ఆకలిలేమి, వికారం, వాంతుల వల్ల కూడా తినలేకపోతారు. దాంతో ఆహారం తీసుకోకపోవడం, ఫలితంగా దేహానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం జరుగుతాయి. దేహంలోకి పోషకాలు అందేందుకు, నోటికి రుచిగా ఉండేలా ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అనే అంశంపై అవగాహన కలిగించుకునేందుకు ‘న్యూట్రిషన్ కౌన్సెలర్’ను సంప్రదించాలి. అపుడు ఆహార నిపుణులు దేహానికి అవసరమైనన్ని క్యాలరీలూ, ద్రవాహారాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను సూచిస్తారు. మానసిక బలం కోసం తోడ్పాటు చాలామంది రోగులు తమకు క్యాన్సర్ ఉందని తెలియగానే తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. నిజానికి ఈ రోజుల్లో క్యాన్సర్లు దాదాపు 90 శాతానికి పైగా రకాలను పూర్తిగా నయం చేయవచ్చు. మొదటి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రోగులు తమ మానసిక బలాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్, సోషల్ థెరపీల కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మానసిక చికిత్సలతో కూడా క్యాన్సర్ ఫెటీగ్‌ను చాలావరకు అధిగమించవచ్చు. విశ్రాంతి : క్రియాశీలంగా ఉండటానికి ప్రయత్నించడంతో పాటు... కొన్ని సందర్భాల్లో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఈ విశ్రాంతి మళ్లీ మన శక్తిసామర్థ్యాలను (ఎనర్జీని) ఆదా చేసుకోడానికీ... దాంతో మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రియాశీలం కావడానికి ఉపయోగ పడుతుందని గ్రహించాలి. అందుకే తమ నిస్సత్తువ కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అనుకోకుండా... అలాంటి విశ్రాంతి సమయాల్లో ఇతరులపై ఆధారపడుతున్నామని సిగ్గుపడకుండా... విశ్రాంతి సమయాన్ని ఎనర్జీని ఆదా చేసుకునే టైమ్‌గా పరిగణించాలి. ఇలా ఈ సానుకూల దృక్పథంతో రోగి మళ్లీ శక్తి పుంజుకుని చురుగ్గా మారగలుగుతాడు. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్) ఎప్పుడూ తనకు వచ్చిన వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడవచ్చు. ఫ్రెండ్స్‌తో సంభాషించవచ్చు (ఈ కోవిడ్ సమయంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా... మొబైల్స్‌లో, వాట్సాప్ ద్వారా ఇతరులతో సంభాషణలు చేయవచ్చు. ఇలా రోగులు తమ సరదా సమయాన్ని గడపవచ్చు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండటం అంటే వ్యాధిపై సగం విజయాన్ని సాధించడమే. కంటికి తగిన నిద్ర చాలామంది క్యాన్సర్ రోగులకు ఉండే ప్రతికూలత ‘నిద్ర’. రోగుల్లో చాలామందికి తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో రోగి మరింత నిస్సత్తువగా మారిపోతాడు. రోగుల్లో ఫెటీగ్‌కు ‘నిద్ర’ అనే అంశం చాలా ప్రధానమైంది. చిన్న చిన్న టెక్నిక్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం పూటకు మాత్రమే పరిమితం చేయడం, నిద్రకు ముందు తీసుకోకపోవడం, నిద్ర వచ్చినప్పుడో లేదా మధ్యానం పూటో కాస్తంత చిన్న చిన్న కునుకులు తీయడం, పవర్న్యాప్ను అలవరచుకోవడం, వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లను అలవరచుకోవడం లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా రోగులు తమ నిద్రాభంగాలనూ, నిద్రలో అంతరాయాల సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. కంటినిండా నిద్రపోవడం అనే అంశం కూడా రోగిలో వ్యాధి నివారణశక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా రోగి త్వరగా కోలుకునేలా చేసే అంశమే. అవసరాన్ని బట్టి మందులు ఒకవేళ రోగిలోని అలసట భావన చాలా ఎక్కువగానూ, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఉంటే రోగి కారణాలనూ, పరిస్థితిని బట్టి డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి ఔషధాలను ఇస్తారు. క్యాన్సర్ రోగులెవరైనా క్యాన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతుంటే పైన సూచించిన సూచనలను పాటించడం ద్వారా తమకు తామే సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య అధిగమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం చాలా ప్రధాన అంశం. దీన్ని గ్రహిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. సగం వ్యాధి తగ్గినట్లే. డా. అజయ్ చాణక్య కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
కరోనా : రూపాయి బలహీనం
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ల బలహీనం, డాలరు స్థిరత్వం నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి నష్టాల్లో ముగిసింది. డాలరు మారకంలో ఆరంభంలో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 76.17 కు చేరింది. చివరకు 19 పైసలు క్షీణించి 76.03 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 28 తర్వాత దేశీయ కరెన్సీ తొలిసారిగా 76 స్థాయిని అధిగమించింది. శుక్రవారం రూపాయి 75.84 వద్ద ముగిసింది. కరోనా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట పడలేదన్న ఆందోళనకు తోడు వ్యాక్సిన్ ఆలస్యంలాంటివి సెంటిమెంట్ ను బలహీనపర్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అనిశ్చితి కారణంగా రూపాయి 76.50 స్థాయికి చేరవచ్చని 75.50 వద్ద కీలకమైన మద్దతు ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. బ్యారెల్ ధర 35.59కు చేరింది. గోల్డ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 1721 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో బలహీనత కొనసాగుతోంది. సెన్సెక్స్ 424 పాయింట్ల నష్టంతో 33352 వద్ద, నిఫ్టీ119 పాయింట్లు కోల్పోయి 9853 వద్ద కొనసాగుతున్నాయి. -
పులి పేల్చన తూపాకి
మనిషి రక్తం మరిగిన పులెంత ప్రమాదకారో వేట రుచెరిగిన మనిషీ అంతే ప్రమాదకారి. పులి వేట ఆకలి కోసం అయితే మనిషి వేట అహం చల్లార్చుకోవడం కోసం. వేటలో పులి పంజా విసిరితే మనిషి తుపాకీ పేలుస్తాడు. పులి బలం పులిదైతే, మనిషి జులుం మనిషిది. మిగతాదంతా మామూలే ప్రాణం దక్కించుకోవడానికి రెండు వైపులా అసమాస పోరాటమే.ఏదో పనిమీద కోలంక వెళ్ళొచ్చిన ఫాలయ్య రావారం కృష్ణమూర్తి గారొచ్చేరని చెప్పడంతో రామన్నయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గబ గబా తయారయ్యి చేలగట్లకడ్డంపడి కోలంక బాట పట్టేడు. వెళతా వెళతా ఓ పంగలకర్రని కూడా నడుం దగ్గర దోపుకున్నాడు. వేట కృష్ణమూర్తిరాజుకి ఆరో ప్రాణం. అదే ఆయన వృత్తి ప్రవృత్తీ కూడా. ఆయన దగ్గరుండే జోడుగుళ్ళ తుపాకీ అంటే కుర్రోళ్ళందరకీ భలే సరదా. చల్లగా... నల్లగా నిగనిగలాడే దాన్నోసారి అలా ముట్టుకొని వళ్ళు మైమరచి పోతుంటారు. పులి వంటి మీద చెయ్యేసి నిమిరినట్టే సంబరపడిపోతుంటారు. తాను ఎన్ని పులులని చంపిందో ఆ తుపాకీకి బాగా జ్ఞాపకమే.అప్పట్లో మారేడుమిల్లి అడవుల్లో... ఓ మేనీటర్ వీరవిహారం చేస్తూ గిరిజనులకి కంటికి కునుకులేకుండా చేసింది. మనిషి నెత్తురు మరిగిన పెద్దపులిని వేటాడ్డానికి, వేటే వ్యసనమైన కృష్ణమూర్తిరాజు అరణ్యవాసం చేపట్టారు. దాని కదలికలని పసిగడుతూ... రోజుకో చోటున మాటు వేస్తూ అదును కోసం ఎదురు చూసారు. పులి బలం ముందు మనిషి బలమెంత? అందుకే... ఆయన పులి బలహీనతల మీద కన్నేసారు. ఒకటి. రెండు..మూడు రోజులు గడిచాయి. రాజుగారి యుక్తి ముందు పులి శక్తి తలొంచింది. చేతిలో తుపాకీ ఢాం అంది. గుండు గురి తప్పలేదు. ఎంతో మంది రక్తం రుచి చూసిన పులి తన రక్తపు మడుగులో తానే గిలగిల్లాడింది. అది మొదలు రాజుగారి తుపాకీకి ఎదురు లేకుండా పోయింది. అరివీర భయంకరమైన ‘మేనీటర్’ ని చంపడం అనేది ఎంతో తెగువ, సాహనం, గుండె దిటవు వున్న వేటగాడికే సాధ్యం. ఇది తెలిసిన వేట ప్రియులు రాజుగారి సాహచర్యం కోసం అన్ని వైపులనుంచీ స్నేహ హస్తం చాపారు. కుర్రజట్టంతా పోరు పెట్టడంతో కృష్ణమూర్తిరాజుగారు వాళ్ళని వెంటేసుకొని మూర్తమ్మ చెరువుకాడకెళ్ళారు. చెరువునిండా చిలకబాతులు కళకళ్ళాడుతూ తిరుగుతున్నాయి. గట్టునున్న తుమ్మ చెట్లమీద నుంచి నత్తగొట్లు ఉండుండి చెరువులోకి దిగి, పెద్ద పెద్ద చేపలని నోట కరుచుకుని ఎగిరిపోతున్నాయి. ఒక్కో ఔత్సాహికుడినీ పిలిచి తుపాకీ ఎలా గురిచూడాలో చెప్పారు.బారెల్ విరిచి గుళ్ళెలా కూరాలో చూపించారు. తుపాకీని దండకి ఎలా దాపెట్టుకోవాలో నేర్పించారు. రెండ్రోజులు కుర్రాళ్ళతోనూ పెద్దోళ్ళతోనూ వేటకబుర్లు చెబుతూ సరదాగా గడిపిన కృష్ణమూర్తిరాజు మూడోరోజు మిత్రుడు సూరిబాబురాజుతో కలిసి వాజేడు అడవుల్లోకి వేటకి వెళ్ళిపోయారు. పులిని చంపాలంటే వేటగాడికి పులి భాష తెలియాలి. పులిని బాగా చదవాలి. కృష్ణమూర్తిరాజు ఆయన తాత చిట్టిరాజు నుంచి ఈ వేట చదువుని బాగా వంటబట్టించుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచీ చిట్టిరాజు మేనీటర్స్ని చంపడంలో చాలా దిట్ట. అడవిదారుల్లో గుర్రాలపై తిరిగే తెల్లోళ్ళని పులులు చంపేసి రక్తం చప్పరించేస్తుండేవి. చేతుల్లో తుపాకులున్నా పులి గాండ్రింపులకే తెల్లోళ్ళు హడలి చచ్చేవారు.దీంతో వాళ్ళు పులికీ తమకీ మధ్య చిట్టిరాజుని అడ్డుగోడగా పెట్టుకునేవారు.ఓ మేనీటర్ బ్రిటిషోళ్ళని పంజాతో అదేపనిగా నంజుకు తినేసేది. వ్యాపారమే తప్ప వేట చేతకాని తెల్లోళ్ళు, తునిరాజు గారి దగ్గర తమ గోడుని వెళ్ళబోసుకున్నారు.ఆయన చిట్టిరాజుని పిలిపించి సంగతి వివరించారు. బ్రిటిష్‌వారికి అడ్డు తగులుతున్న పులులని అంతం చేసెయ్యమన్నారు.‘‘మనం చేయలేని పని పులులు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తూంటే... ఆ పులులు దేశభక్తుల్లా కనిపిస్తున్నాయి’’ అని పులులని ప్రశంసిస్తూ చిట్టిరాజుగారు ఆ పనికి ఒప్పుకోలేదు.‘‘వాటి పంజాలకి మనవాళ్ళూ బలవుతున్నారు కదా? కాబట్టి పులుల్ని చంపాల్సిందే’’ అని రాజావారు తీర్మానించారు.‘‘అయితే ఓ షరతు, నేను పులిని చంపాకా ఈ తెల్లోళ్ళు నాతో కరచాలనం చేయడానికి వీల్లేదు. అలా అయితేనే చంపుతాను’’ అని ఓ నిబంధన పెట్టి పులుల సంహారానికి దిగారు చిట్టిరాజు.చిట్టిరాజుగారి ఈ చర్యతో ఓ సాహసికుడి చేతిని స్పృశించలేక పోతున్నామన్న వ్యధ అప్పటి బ్రిటిష్ అధికారుల్లో వుండేది. పులి ఎప్పుడూ నీరూ తిండీ, దండిగా దొరికే ప్రాంతాన్నే ఆవాసంగా మార్చుకుంటుంది. నీటి వసతి వున్న ప్రాంతంలో మాటు వేసి నీటిని త్రాగడానికి వచ్చే జంతువుని చంపుతుంది. సింహం మృగరాజు అయితే అయివుండొచ్చు. పెద్దపులి అడవికే రారాజు. సింహాలు గుంపులుగా తిరుగుతాయి. కానీ పెద్దపులి ఒంటరిగానే తిరుగుతుంది. అది తిరిగే ప్రాంతానికి మరో పులిని సైతం రానీయదు. అది ఆడైనా, మగయినా దాని అంతు చూసేస్తుంది.వేటగాడిగా మహా గుర్తింపు పొందిన కృష్ణమూర్తిరాజుతో కలిసి వేటాడ్డానికి, సరదాగా ఆయన వేట చూడ్డానికి దేశం నలుమూలలనుంచీ చాలా మంది వస్తుండేవారు. అధికార్లే కాకుండా నాయకులూ, ఇతర ప్రముఖులూ కూడా అందులో వుండేవారు. పగలూ రాత్రి కూడా వేట సాగుతుంటుంది. తూర్పు కనుమల్లోని పెద్ద పులులే కాకుండా చిచ్చర పిడుగుల్లాంటి చిరుతపులులు కూడా రాజుగారి తూటాలకి బలయిపోయాయి. పులిజాడ కనిపించకపోవడంతో సంఘవిద్రోహ శక్తులు అడవిలోకి చొరబడ్డం మొదలయ్యింది. అక్రమాలకి అడవి అడ్డా అవ్వడం చాప కింద నీరులా జరిగిపోయింది. తన విశృంఖల వేటలో పులి లేని అడవితల్లి దిక్కుమాలినదయ్యిందని పులిలాంటి ఆ వేటగాడికి తెలియదు. వేటగాడికి కావాల్సింది ప్రధానంగా సహనం, ఏకాగ్రత, అప్రమత్తత. పులిని వేటాడ్డానికి ఒక్కోసారి కూర్చొన్న చోటునుంచి రెండు మూడు రోజులు కదలకుండా కూర్చోవాలి. అయినా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎంత గొప్ప వేటగాడికైనా ఒక్కోసారి ప్రాణాపాయం తప్పకపోవచ్చు. అందుకు కృమూర్తిరాజూ అతీతుడు కాదు. వేటగాళ్ళకి వేటగాళ్ళే మిత్రులు. వారికి జంతువులూ మృగాలూ ఉమ్మడిశత్రువులు. కృష్ణమూర్తిరాజూ ఆయన మిత్రుడు సూరిబాబురాజూ కలిసి మరో మిత్రుడి ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు. మాటలమధ్య ఎర్రకొండల్లో పులి వుందన్న సంగతి తెలిసింది. ఇంట్లో అటూ ఇటూ వెదికే సరికి రెండు నాటు తుపాకులు దొరికాయి. లేడికి లేచిందే పరుగన్నట్టు వాడకంలో లేని ఆ రెండు గొట్టాం తుపాకులు, నాలుగు తూటాలు పట్టుకుని బుల్లెట్ బండి మీద కొండల్లోకి పోయారు. వేటగాళ్ళని చూడగానే అలవాటైన గిరిజనులు అవసరమైన సరంజామాతో సన్నధ్ధమై పోయారు.అంతా కలిసి కొండ ప్రక్కన మాటు వేసారు.పులిజాడ కనిపెట్టడానికి వేటగాళ్ళు ముందు వాటి అడుగులని పట్టుకుంటారు.వాటిని బట్టి పులి బరువూ వయస్సూ ఆకారాన్ని అంచనావేస్తారు. పులి ఏదైనా జంతువుని వేటాడాక దాని రక్తం పీల్చేస్తుంది. పాతిక నుంచి ముప్పై కేజీల వరకూ మాంసం లాగిస్తుంది.మిగిలిన మాంసాన్ని పొదల్లోకి తీసుకెళ్లి దాచుకుని మూడురోజుల్లోపు దాన్ని మొత్తం తినేస్తుంది. కడుపు నిండాకా ఆ చుట్టు పక్కల అనువైన చోట విశ్రమిస్తుంది. అది ఎక్కడ? అన్నది ఎవరూ చెప్పలేరు. ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా కావచ్చు. పౌర్ణమి రోజులు, వెన్నెల వానలో అడవి తడిసి ముద్దవుతోంది. కీచురాళ్ళ రొద అంతకంతకీ ఎక్కువవుతోంది. చేరువలో నిద్రపట్టని ఏదో పిట్ట అదే పనిగా అరుస్తోంది. టక్కుమని దాని అరుపు ఆగిపోయింది.దాంతో పులి రాక కోసం వేచి చూస్తున్న మిత్రులిద్దరికీ అది వస్తున్న సంకేతం అందింది.అంతా అప్రమత్తమయ్యారు. ఖాళీ ప్రాంతం నుంచి కొండవైపు చలాకీగా పరిగెడుతోంది చిరుతపులి. కృష్ణమూర్తి సడన్‌గా వేసిన టార్చ్ వెలుగు దాని కళ్ళల్లో మెరిసింది. కొన్ని క్షణాలపాటు చిరుత అయోమయానికి గురయ్యింది.సూరిబాబుగారి తుపాకీలోంచి గాలిని చీల్చుకుంటూ తూటా దూసుకెళ్ళింది.తిరిగి పరుగందుకోబోయిన చిరుత గాండ్రిస్తూ గాల్లోకి ఎగిరి, పొదల్లోకి విరుచుకు పడిపోయింది. గిరిపుత్రులు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు.వేటగాడు ఏదైనా జంతువుని కొట్టినప్పుడు వెంటనే అది పడిన చోటుకు వెళ్ళడు. కొంత సేపటి తరువాత, ఇక అది చనిపోయి వుంటుందని నిర్థారణ కొచ్చాకా మాత్రమే వెదుక్కుంటూ వెళతాడు. మిత్రులు ఇద్దరూ మిగతా జనంతో పాటూ అక్కడనుంచి వెనుదిరిగారు. కొంతదూరం వెళ్ళాకా మళ్ళీ రేపటిదాకా ఆగడం ఎందుకు? ఈపాటికి చచ్చేవుంటుంది లాక్కొచ్చి పడేద్దాం అని చిరుత పడిన చోటికి వెళ్ళి లైట్లు వేసారు. అందరికీ వళ్ళు జలదరించింది. చిరుత బతికే వుంది. చెట్టు పక్కన బాధతో విల విల్లాడుతోంది. టార్చ్ వెలుతురులో పులికళ్ళు మెరిసాయి.వేటగాళ్ళిద్దరూ అప్రమత్తమయ్యారు. చేతుల్లో తుపాకుల గొట్టాలు విరచి రెండు గుళ్ళు కూరి పులి వేపు గురిపెట్టారు.దెబ్బతిన్న పులి చాలా ప్రమాదకరం. రెచ్చిపోతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది. పులి నెమ్మదిగా చీకటిని చాటు చేసుకుంటూ దేహం మొత్తాన్ని చెట్టుచాటుకు లాక్కుంది. తోకని ఒకసారి బలంగా నేలకేసి కొట్టి కృష్ణమూర్తి రాజు మీదకి లంఘించి దూకింది. ఇది ఆయన ఊహించలేదు. గుండు దెబ్బకి రక్తం పోయిన అది నీరసపడి వుంటుందని ఏమరుపాటుగా వున్నారు. దాని పంజా దెబ్బకి ఆయన మెడ విరిగినట్టయ్యింది. క్రింద పడ్డ ఆయన చేతిలోని తూపాకి దూరంగా పడిపోయింది.చిరుత నోరు తెరచి పదునైన కోరలని ఆయన కంఠం వైపు చాపింది. దానినోట్లోంచి కారుతున్న చొంగతో ఆయన లాల్చీ తడిసి పోయింది. సూరిబాబురాజు తుపాకీని గురి చూస్తూ అటూ ఇటూకదులుతున్నారు. తోడొచ్చిన గిరిజనులు దూరంగా పరిగెత్తి భయం భయంగా చూస్తున్నారు.పరిస్థితిని అంచనా వేసిన కృష్ణమూర్తిరాజు అనూహ్యంగా తన ఎడమ చేతిని పులి నోట్లో పెట్టేసారు.దాని నోటినుంచి తన పీకనితప్పించాలంటే అంతకు మించి ఆయనకి మరో మార్గం లేదు.పులి గొంతులో ఇరుక్కున్న కృష్ణమూర్తి రాజు చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతోంది.వెళ్ళకిలా రాజుగారు. రాజుగారి మీద బరువైన పులి.దానినోట్లో చిక్కుకున్న ఆయన చేయి.పులిని గురి చూస్తూ సూరిబాబు గారి తుపాకీ. కానీ ఆయన పులి తల్లోకి పేల్చడానికి వీలు కావడం లేదు, తూటా అటీటైతే కృష్ణమూర్తి రాజుగారికి తగిలే ప్రమాదం వుంది.అంత పులి బరువునూ మోసుకుంటూ, కాళ్ళు నేలకి తన్ని పెట్టి నడుం మీద పాక్కుంటూ పడిపోయిన తన తుపాకీని కుడి చేత్తో అందుకున్నారు కృష్ణమూర్తి రాజు. దాన్ని పులి తల దాకా తెచ్చి ట్రిగ్గర్నొక్కారు. ఆ డొక్కు తుపాకీ చేసిన మోసం అంతా ఇంతా కాదు. అది పేల లేదు. ఆయనకే కాదు అక్కడున్న అందరికీ గుండెలు జారి పోయాయి. కృష్ణమూర్తి రాజుకి ఇదే ఆఖరి రోజు అని అర్థమైపోతోంది.మిత్రులిద్దరిదీ వందల పులులని చంపిన అనుభవం. ఆఖరి ప్రయత్నంగా సూరిబాబురాజు పులిడొక్కలోకి కాల్చారు. పుటుక్కుమందే తప్ప అదీ ఢాం అనలేదు. తుక్కు తుపాకీలతో వేటకొచ్చి ఎంత పెద్ద పొరపాటు చేసారో అప్పుడర్థమయ్యింది ఆయనకి. కోపంగా ఆ తుపాకీని విసిరికొట్టారు.అంతకంతకీ పులిది పై చేయి అయిపోతోంది. చేతినుంచి రక్తం పోతున్న కృష్ణమూర్తి రాజు నీరసపడి పోతున్నారు.పులి పరిస్థితీ అదే. కానీ తన శత్రువు బలహీన పడుతున్న సంగతి గ్రహించి అది పట్టు బిగిస్తోంది.తేరుకున్న సూరిబాబురాజు పులి బలాన్నీ బలహీనతనీ పసిగట్టారు. పులి దాని బలాన్నంతా వెనక కాళ్ళమీదే మోహరించింది. వెంటనే పులి వెనక్కి వెళ్ళి నేలకి అదిమి పెట్టివున్న దాని వెనకి కాళ్ళని బలంగా రెండు చేతులతో పైకి లేపడం మొదలెట్టారు. దూరంగా వున్న గిరిజనులని ‘‘రండ్రా రండి’’ అంటూ పిలిచారు.గిరిజనులు సూరిబాబురాజు చుట్టూ గుమి గూడారు. వాళ్ళ చేతుల్లో బరిసెలూ కత్తులూ గొడ్డళ్ళూ ఉన్నాయి. వెనక కాళ్ళు పట్టు దప్పడంతో పులి నోటిపట్టు కూడా కొంచెం సడలింది. అదే అదునుగా కృష్ణమూర్తిరాజుగారు బలాన్నంతా కూడ గట్టుకుని పులిని తన మీద నుంచి త్రోసేసారు. అది తిరిగి లేచే లోపే ఓ గిరిజనుడు చేతిలోని గొడ్డలితో పులి తలమీద బలంగా వేటు వేసాడు. అలా పులిని వదిలించుకొని కృష్ణమూర్తి రాజు మృత్యుంజయుడయ్యారు. అడవికి పులి కాపలా. రాజసం గాంభీర్యం దాని సొంతం. శక్తికీ యుక్తికీ పట్టుదలకీ అది ప్రతిరూపం. అడవిలో పులి వుందంటే అటు వెళ్ళడానికి మనిషన్నవాడు హడలి చావాల్సిందే.అందుకే పులి మనిషికి శత్రువు. అడవిని జయించాలంటే మనిషి పులిని అంతమొందించాల్సిందే. పులిలేని అడవి అసాంఘిక శక్తులకు ఆడింది ఆట పాడింది పాటగా మారుతుంది. కానీ మనిషే పులై అడవికి కాపలా కాస్తే... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? పులినోట్లో చెయ్యెట్టి తలని తప్పించుకున్న కృష్ణమూర్తిరాజు కొంతకాలం వేటకి విరామం ప్రకటించక తప్పలేదు. ఆయన గుండె ధైర్యానికి అందరికీ వెన్ను జలదరించింది. ఎన్నో నోరులేని ప్రాణులని చంపిన ఆయనకి, తొలిసారి ఓ పులి ప్రాణం విలువనీ! ప్రాణభయాన్నీ! తెలియజెప్పడమే కాదు, ఆలోచనలోనూ పడేసింది. కానీ... తిరిగే కాలూ పేలే తుపాకీ తీరుబడిగా ఒక్క చోట కుదురుగా వుండవు కదా!కృష్ణమూర్తిరాజుగారి వేట మళ్ళీ మొదలయ్యింది. ఎక్కడా పులుల అలికిడి లేకపోవడంతో అడవిపందులూ, కణుజులూ, కొండగొర్రెలూ అతిధులకీ గ్రామస్థులకీ విందుగా మారుతున్నాయి. మృగాలులేని అడవిలోకి మానవమృగాలు ప్రవేశించాయని కృష్ణమూర్తి ఆలస్యంగా గ్రహించారు. అడవిలో పులులని లేకుండా చేసి తాను ఎంత తప్పు చేసారో ఆయనకి అర్ధం అయ్యింది.దాంతో... ఆయన తుపాకీ ఈ కొత్త జంతువుల వైపు తిరిగింది.కృష్ణమూర్తి తుపాకీమడమ నాటుసారా కుండలని బద్దలు గొట్టేది. ఆయన వెలిగించే అగ్గిపుల్ల గంజాయి పంటని దహించేది. తుపాకీ తూటా లారీ టైర్లలోకి దూరి అక్రమకలప అధికారుల కంట్లో పడేది.అడవిలో ఒంటరిగా తిరిగే రాజుగారు, ఆసాంఘిక శక్తులకి పులిలా కనపడ్డం మొదలెట్టారు. శత్రువులు మొదలయ్యారు. పెరిగారు, వాళ్ళంతా ఏకమయ్యారు. కృష్ణమూర్తి రాజు పులికోసం మాటు వేసినట్టే వాళ్ళు రాజుగారి కోసం మాటువేసి అదును కోసం ఎదురు చూసారు.ఓ రోజు రాత్రి అడవికి వెళ్ళిన రాజుగారికి కొంతమంది అక్రమ వ్యాపారులు అనుకోకుండా కనపడ్డారు. ‘‘మరోసారి కనిపిస్తే కాల్చేస్తా’’ అంటూ హెచ్చరించి ఆయన అక్కడ నుంచి కదిలారు.చక చక మంటూ ఏదో మృగం కదిలిన అలికిడి వినిపించడంతో కృష్ణమూర్తి వెనక్కి చూసారు. అప్పటికే ఆలస్య మయ్యింది. ఓ బడితె దెబ్బ రాజు గారి మెడ వెనకపడింది. కింద పడ్డ రాజుగారు క్షణాల్లో తేరుకొని తుపాకీ గురిపెడుతూ లంఘించి లేచారు. ఓ తూటా ఒకడి కాలిని చీల్చేసింది. మరో తూటా పేల్చేలోగానే ఆ చేతిమీద మరో దెబ్బ తగిలింది. కష్ణమూర్తి రాజుగారి తుపాకీ నేల జారింది. ఆయన మోకాళ్ళ మీద కూలబడి పోయారు. ఒకడు కింద పడ్డ తుపాకీని తీసి మడమతో ఆయన తలపై కసిగా మోదాడు. రాజుగారి కళ్ళు మూతలు పడ్డాయి. ఆయన కళ్ళముందు గుండు దెబ్బ తగిలి విలవిల్లాడిన పెద్దపులులూ... చిరుతలూ... అడవి పందులూ.... దుప్పులూ... కణుజులూ రక్తమోడుతూ కలగా పులగంగా కనిపిస్తుంటే తలవాల్చేసారు.చట్టం తనపని తాను చేసుకుంటూ పోయింది. ప్రాణం తీయడం చట్టరీత్యా నేరం. అది మనిషిదైనా మృగానిదైనా ఒకటే. హత్య చేసిన వాళ్ళే కాదు. ఆ హత్యకి సహకరించిన వాళ్ళూ చట్ట రీత్యా నేరస్థులే. రాజుగారు వన్య ప్రాణులని వేటాడారు. అందుకు ఆయన డబుల్ బ్యారెల్ గన్ సహకరించింది. కనుక అదికూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే.అవును... ఇప్పుడు ఆ తుపాకీ రాజుగారు లేని ఒంటరితనాన్ని శిక్షగా అనుభవిస్తోంది. మీరు ఆ జోడుగుళ్ళ తుపాకీని పరామర్శించాలనుకుంటే... జగ్గంపేట పోలీస్ స్టేషన్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. - చిరంజీవి వర్మ -
నాడుల పెరుగుదలకు కొత్త పద్ధతి
ప్రమాదాలు.. గాయాలు.. ఆ మాటకొస్తే స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లపై ఎక్కువగా టైపింగ్ చేసినా సరే.. శరీరంలోని కొన్ని నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా చేతులు, కాళ్లలో తిమ్మిరి, బలహీనత, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటివరకూ ఈ పెరిఫరల్ న్యూరోపతికి చికిత్స కొన్ని నెలలపాటు మందులు వాడటమే. అయితే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని సమీప భవిష్యత్తులో దెబ్బతిన్న నాడులను వేగంగా నయం చేసే వీలుంది. శరీరంలోకి జొప్పించగల చిన్న పరికరం ద్వారా నాడులకు క్రమంగా విద్యుత్ ప్రచోదనాలు అందించడం ద్వారా ఎలుకల్లో తాము నాడీ గాయాలు వేగంగా మానిపోయేలా చేయగలిగామని విల్సన్ జాక్ రే అనే శాస్త్రవేత్త తెలిపారు. పావలా కాసంత ఉండే ఈ పరికరం రెండు వారాల్లోపు నిరపాయకరంగా శరీరంలో కరిగిపోతుందని అన్నారు. విద్యుత్ ప్రచోదనాలతో నాడులు మళ్లీ పెరిగేలా చేయవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఎలా దీన్ని సాధ్యం చేయాలన్నది ఇప్పటివరకూ సమస్యగా ఉండిందని, కొత్త పరికరంతో ఈ సమస్య తీరినట్లేనని జాక్ రే తెలిపారు. మెదడులోని న్యూరాన్లు, వెన్నెముక నాడులను మినహాయిస్తే మిగిలినవి మళ్లీ పెరిగేలా చేయవచ్చు. విద్యుత్తు ప్రచోదనాల ఫలతంగా కొన్ని ప్రొటీన్లు విడుదలై గాయం వేగంగా మానుతుందని అంచనా. -
ఏడో రోజూ బలహీనమే
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. నిన్నటి ముగింపుతో పోల్చుకుంటే నేడు (గురువారం) డాలరుమారకంలో 9 పైసలు కోలుకుని 71.66 వద్ద ట్రేడింగ్ ఆరం భించింది. కానీ అంతలోనే వరుసగా ఏడో రోజుకూడా బలహీనపడింది. రోజుకో ఆల్‌టైం కనిష్టాన్ని చూస్తున్న రూపాయి తాజాగా 72స్థాయికి చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం 34పైసలు దిగజారి 71.92 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి వరుస పతనంపై ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం అంతర్జాతీయ కారణాల కారణంగా రూపాయి విలువ క్షీణిస్తోందని, ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీయ యూనిట్ బాగానే ఉందని అన్నారు. కాగా బుధవారం 71.75 వద్దరికార్డు ముగింపును నమోదు చేసింది. ఇంట్రా డే లో చారిత్రాత్మక కనిష్టం 71.97ని టచ్ చేసింది. -
విభేదాల మధ్య మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉండగలరా?
కాపురంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో మనస్పర్థలూ అంతే సహజం. కాని కొంతమందికి జీవితంలో మనశ్శాంతి కరువవుతుంది. జీవితభాగస్వామి బాధపెడుతుంటే భార్య/భర్త తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురికావలసి వస్తుంది. అర్థం చేసుకోని లైఫ్పార్ట్నర్ దొరికినప్పుడు సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అయితే మీరే అర్థం చేసుకోగలిగినప్పుడు బాధపెట్టే జీవితభాగస్వామితో సర్దుకొని పోవచ్చు. కాని దానికీ పరిధి ఉంటుంది. బాధ పెట్టడం మరీ ఎక్కువైనప్పుడు, మీరు భరించలేని స్థితికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారమయ్యేవరకు మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు దూరంగా ఉండటమే మంచిది. అయితే పరిస్థితి అంతదూరం రానివ్వకుండా మీ జీవితభాగస్వామితో కలిసివుండే ప్రయత్నం చేయచ్చు. బాధపెట్టే మీ జీవితభాగస్వామితో కలిసి ఉండగలరా? మీలో ఆ నైపుణ్యం, ఓర్పు ఉందా? 1. మీ జీవితభాగస్వామి బలహీనతలను అర్థం చేసుకొని, వారిని క్షమించగలరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. ఎవరైనా ప్రతిసారీ తప్పు చేయరని నమ్ముతారు. బాధతో ఉన్నప్పుడు మీ జీవితభాగస్వామితో మీరు గడిపిన సంతోష క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని బాధలకు గురిచేసిన సంఘటనలను మనసులో ఉంచుకోరు. ప్రతిరోజూ కొంత సమయాన్ని విశ్రాంతిగా గడుపుతారు. ఎ. అవును బి. కాదు 4. ప్రతిమనిషికీ సమస్యలుంటాయనుకుంటారు. జీవించినంత కాలం ఆనందంగా ఉండాలని మనసులో గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. మీలా సమస్యల్లో బాధ పడేవారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, వీలైతే మీ జీవితభాగస్వామికి నచ్చిన విధంగా నడుచుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఎప్పుడూ అధైర్యపడరు. సమస్యలను ఎదుర్కొనేందు ధైర్యం అవసరమనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. లైఫ్పార్ట్నర్ బాధ పెట్టేటప్పుడు మాట్లాడకుండా ఉండరు. వారి సమస్య ఏమిటని ప్రశ్నిస్తారు. మీరెంత బాధ పడుతున్నారో వివరించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. వాదనకు దిగరు. ఎక్కువసేపు వాదోపవాదాలను కొనసాగనివ్వరు. ఆర్గ్యుమెంట్ వల్ల రిలేషన్ మరింత దెబ్బతింటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 10. ఎక్కువ కాలం మీ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించరు. ఆందోళనతో మీ నిద్ర, ఆరోగ్యం చెడగొట్టుకోరు.(ఇదే సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ ఆనందంగానే ఉంటారని గుర్తించగలరు). ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ లైఫ్ పార్ట్నర్ ఇబ్బందులకు గురిచేస్తున్నా వారితో సర్దుకుపోవాలనుకుంటారు. మీలో సహనగుణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవితభాగస్వామితో కలిసుండేలా చేస్తుంది. కోపం వచ్చినా మీ పార్ట్నర్ను అర్థం చేసుకుంటారు. ‘బి’ సమాధానాలు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే బాధపెట్టే మీ పార్ట్నర్తో మీరు కలిసివుండలేరు. సర్దుకుపోలేక పోవటం వల్ల అలజడికి గురవుతారు. మీ మధ్య చిన్న చిన్న విషయాల వల్ల విభేదాలు వచ్చినా, మీ జీవితభాగస్వామి కలిగించే ఇబ్బందులు మితిమీరకుండా ఉన్నా వాటిని క్షమించటానికి ట్రై చేయండి. ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. -
డబ్ల్యుపీఐ డేటా: రూపాయి నష్టాల్లోకి
సాక్షి,ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం డేటా నిరాశపర్చడంతో ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. 10 గంటల సమయానికి 67.22 వద్ద కొనసాగినా..మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. 0.02పైసలు క్షీణించి 67.34 వద్ద కొనసాగుతోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 67.21 దగ్గర ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు 67.33తో పోల్చితే 0.06 శాతం బలపడింది. ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం లాంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ బలపడింది. అయితే టోకు ధరల ద్రవ్యో ల్బణం (డబ్ల్యూపీఐ) డేటా 3.18 వద్ద నాలుగునెలల గరిష్టాన్ని నమోదు చేయడంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల పోలింగ్, రేపు (మంగళవారం) కౌంటింగ్ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. -
నిద్రలేచిన వెంటనే నడవలేకపోతున్నాను
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. మూడు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటి? తగిన సలహా ఇవ్వండి. – డి. అనసూయమ్మ, సామర్లకోట మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి. ఎముకల్లో రాత్రివేళ నొప్పి... ఎందుకిలా? నా వయసు 48 ఏళ్లు. కొన్ని నెలలుగా కాళ్ల ఎముకల్లో రాత్రి వేళల్లో నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి, యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. కానీ ఎలాంటి ప్రయోజనమూ కనిపించడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. చంద్రశేఖర్‌రావు, విజయవాడ మీకు ఎక్కువగా రాత్రివేళల్లో ఎముక నొప్పి వస్తోందటున్నారు. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు ఎముక క్యాన్సర్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్‌ను నొప్పితోగాని, నొప్పి లేకుండా కణుతులతోగాని గుర్తిస్తారు. ఎముకకు సంబంధించిన మృదు కణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే భాగంలో క్యాన్సర్ వస్తే మాత్రం నొప్పి, ఆ భాగంలో వాపు ముందుగా కనిపిస్తాయి. ఎముక క్యాన్సర్ రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఎముకకు చుట్టు కొంత భాగం వరకు వాపు ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి ఒక చోటి నుంచి ఇంకో చోటికి వ్యాపించకుండా ఉండటానికి మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత భాగం వరకు ఉన్న భాగాన్ని ‘రియాక్టివ్ జోన్’ అంటారు. క్యాన్సర్ వ్యాప్తిని నివారించడానికి ప్రకృతి చేసిన ఏర్పాటిది. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్ దుష్ప్రభావాలు, మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ఆ భాగంలో కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలా మంది ఎముకలో నొప్పి, వాపు కనిపించగానే మసాజ్ చేయిస్తుంటారు. అందుకే నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చిన్న దెబ్బ తగిలినా ఎంతో నొప్పి! నా బరువు 87 కేజీలు. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు. నాకు యూరిక్ యాసిడ్ కాస్త ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులో వచ్చింది. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనంత నొప్పి వస్తోంది. ఎముకలు చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. నాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలా రోజులు ఉంటోంది. నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – రాధిక, నల్లగొండ మీరు మీ వయసెంతో మీ లేఖలో చెప్పలేదు. అయితే మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ ఎత్తుకు మీరు చాలా బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మొదట మీరు మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. బాడీమాస్ ఇండెక్స్ ప్రకారం మీ ఎత్తుకు సరిపడ బరువు ఉండేలా చూసుకోవాలి. మీరు చాలా బరువు పెరగడం వల్ల ఆ భారమంతా మీ ఎముకలపై పడి అవి నాజూకుగా తయారయ్యాయి. ఆ కారణంగానే మీకు ఇలా నొప్పి వస్తుండవచ్చు. మీరు కొద్దిగా ఆహారనియమాలు పాటిస్తూ, ఉదయం సాయంత్రం వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ మీ అధిక బరువును నియంత్రించుకోండి. అలాగే రోజూ ఉదయం ఒక క్యాల్షియం మాత్ర తీసుకుంటూ ఉండండి. ఇలా మూడు నెలలు చేయండి. దాంతో మీ బరువు నియంత్రణలోకి వచ్చి మీ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వదులుకోజాలని అవకాశం!
రమజాన్ కాంతులు ఒక వ్యక్తి దైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవ రూపంలోని దైవదూత గుణసంపన్ను గా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశ్యం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక, దైవ ప్రసాదితమైన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇచ్ఛానుసార జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసార జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకగా సాగిపోతోందంటే, ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనం ఈవాలి. దైవభీతితో హృదయం కంపించి పోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలుపంచుకోడానికి పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. –హసీనా షేక్ -
మా సహనం బలహీనతగా అనుకోవద్దు
ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యతే లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వద్దనే మౌనం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సహోదర్‌రెడ్డి పరకాల : మా సహనాన్ని బలహీనతగా, చేతగాని తనంగా అనుకోవద్దని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అందరిని కలుపుకొని పోవాల్సిన నైతిక బాధ్యత ఉంది. పాత వాళ్లకు ఎలాంటి రిసీవింగ్ లేక ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఓపిక పడుతున్నాం. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. వేరే పార్టీలో గెలిచినప్పటికీ పార్టీ బలోపేతం కోసం టీఆర్ఎస్లో చేరిన అభ్యంతరం చెప్పలేదన్నారు. కానీ పార్టీలో చేరినప్పటి నుం చి పాతవాళ్లకు గుర్తింపు లభించడం లేదన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని నాకే ఏం తెలియడం లేదు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దనే మౌనంగా ఉంటున్నామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో పాత, కొత్తవారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరకాల ను జిల్లా కేం ద్రంగా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. కనీసం రెవెన్యూ డివిజ¯ŒSగానైనా ఉండాలన్నారు. రెండు రాకపోతే పరకాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందని సహోదర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
ఆమె బలహీనత నన్ను బాధ పెట్టేది!
మనోగతం ఆడవాళ్ల నోట్లో ఆవగింజ నానదు... అనే మాట వినడమేగానీ పెళ్లయ్యాకగానీ అది నా అనుభవంలోకి రాలేదు. మా ఆవిడ చాలా మంచిది. అయితే ఆమెకు ఉన్న చిన్న బలహీనత ఏమిటంటే-మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ల అన్నయ్యలకు, నాన్నకు చెబుతుంది. ఒకరోజు... ‘‘బావగారూ! మీరు అలా చేసి ఉండాల్సింది కాదు’’ అని పెద్ద బావమరిది నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ఏంచేశాను?’’ అని అడిగితే- ‘‘కూర బాగా లేదని కసురుకున్నారట కదా...’’ అన్నాడు. తల పట్టుకున్నాను నేను. ఇక మామగారు చీటికిమాటికీ ఫోన్ చేస్తారు. ‘‘సొంత ఇల్లు ఉండాలండీ...ఎంతకాలమని అద్దె ఇంట్లో ఉంటారు’’ అని నాన్‌స్టాప్ ఉపన్యాసం ఇస్తాడు. చిన్న బావమరిది ఏ మాత్రం తనకు సమయం దొరికినా ఫోన్ చేసి ‘‘మీరు అలా కాదు...ఇలా ఉండాలి’’ అని ఏదో చెప్పబోతాడు. ఈ ఫోన్ల బెడద...చివరికి ఆఫీసు వరకు వచ్చి పనికి అంతరాయం కలిగించేది. ఇక ఇలా అయితే కుదరదనుకొని మా ఆవిడతో తగాదా పెట్టుకోవడానికి మంచి ముహూర్తం ఒకటి నిర్ణయించుకున్నాను. ఒక ఆదివారం పూట గొడవకు దిగాను. ‘‘అమ్మానాన్నలు నీకు పెట్టిన పేరు...శ్రీలత. బీబీసి కాదు’’ అన్నాను. ‘‘అంటే?’’ అంది ఆమె అర్థం కానట్లు. ‘‘మన ఇంట్లో చీమ చిటుక్కుమన్నా మీ పుట్టింటివాళ్లకు చెబుతావు. నిన్ను కాదు...ఈ సెల్ఫోన్లను అనాలి’’ అన్నాను. ‘‘ఏదో పక్కింటి వాళ్లకు చెబుతున్నట్లు ఫీలైపోతారేమిటి?’’ అని ఆమె ముఖం మాడ్చుకుంది. ‘‘అలా కాదు తల్లీ’’ అంటూ ఆమెకు అర్థమయ్యేలా అన్ని విషయాలూ చెప్పాను. ‘గుట్టు’ అనేది సంసారానికి ముఖ్యం అని గుర్తు చేశాను. తరచుగా నాకు ఫోన్ చేయడం వల్ల వచ్చే సమస్యలు చెప్పాను.ఆమె నా బాధలు అర్థం చేసుకుంది. మారింది. నాకు సంతోషాన్ని ఇచ్చింది. -ఆర్ఆర్, తెనాలి -
దేహంలో ఒక పార్శ్వం కదలకపోతే... పక్షవాతం
అవగాహన పక్షవాతం దాడి చేసినప్పుడు ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే రోగి కోలుకోవడం కూడా అంతే వేగంగా జరుగుతుంది. చిక్కంతా ‘పక్షవాతం లక్షణాలు ఇలా ఉంటాయి’ అని తెలియకపోవడంతోనే వస్తుంటుంది. బలహీనత, దేహంలో ఒక వైపు కదలికలు మందగించడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిరి ఉన్నట్లుండి కంటి చూపు మసకబారడం (ముఖ్యంగా ఒక కన్ను). మాట తడబాటు, మాట పట్టేయడం, మాట స్పష్టంగా అర్థం కాకపోవడం మింగలేకపోవడం (ఘన పదార్థాలే కాక ద్రవాలు మింగడం కూడా) తల తిరిగినట్లు ఉండడం, మెదడుకు, దేహ కదలికలకు మధ్య సమన్వయం లోపించడం (ఉదాహరణకు చెయ్యి పెకైత్తబోయినప్పుడు అనుకున్నట్లు కదిలించలేకపోవడం, వేళ్లకు పట్టు దొరకకపోవడం, నుదుటిని తాకాలని ప్రయత్నిస్తే చేయి ముక్కు దగ్గరే ఆగిపోవడం వంటివి), కదలికలు మద్యం సేవించిన వారిలా ఉండడం నిలబడినప్పుడు రెండు కాళ్ల మీద ఒకే విధంగా బరువును మోపలేకపోవడం రెండు చేతులను ఒకే రకంగా కదిలించలేకపోవడం, చేతులను పెకైత్తినప్పుడు ఒక చెయ్యి కిందకు పడిపోతుండడం భరించలేనంత తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొన్ని కనిపించినా, వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. -
నమ్మకం: అరిష్టమా? అదృష్టమా?
మంచి నమ్మకం బలమవుతుంది. చెడు నమ్మకం ముదిరితే బలహీనతగా మారుతుంది. కానీ మనం నమ్మేది మంచిదో కాదో తెలుసుకోవడమే పెద్ద చిక్కు. ఎందుకంటే ప్రతి మనిషికీ తాను నమ్మేదే నిజమనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే అన్ని నమ్మకాలూ నిజాలు కావు. అలాంటి నిజం కాని నమ్మకమొకటి ఎన్నో యేళ్లుగా నల్లపిల్లి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. నల్లపిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందని, నల్లపిల్లి ఇంట్లో ప్రవేశిస్తే దుష్టశక్తి ఇంట్లోకి వచ్చిందని అనుకోవడం వెనుక ఎంత నిజముంది? నల్లపిల్లి పేరు చెబితే వణికిపోయే దేశాలు చాలా ఉన్నాయి. అది కనుక ఎదురొస్తే మనమో లేదా మనవాళ్లెవరో మంచమెక్కుతారని, ప్రాణం కూడా పోవచ్చని వణికిపోతుంటారు పలు దేశాల వాళ్లు. కుక్క ఎదురు పడితే పోని ప్రాణం, పిల్లి ఎదురొస్తే పోవడమేమిటి అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే, దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు కాబట్టి! మొదట్లో నల్లపిల్లి కూడా అన్ని జంతువుల్లాంటిదే. కానీ మధ్య యుగంలో ఎలా మొదలైందో తెలీదు కానీ, నల్లపిల్లికి చెడుకాలం మొదలైంది. దుష్టశక్తుల్ని పారద్రోలడానికి, మేలును పొందడానికి నల్లపిల్లిని బలిచ్చే సంప్రదాయం మొదలైంది. అది కాస్తా తర్వాత అసలు నల్లపిల్లి అంటేనే దుష్టతకు నిలయమని, దుష్టశక్తులు దాని చుట్టూ తిరుగుతుంటాయని, అందువల్లే అది అపశకునమని, అపవిత్రమని నమ్మడం మొదలైంది. అయితే ఇలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. యూరోప్ దేశాల్లో నల్లపిల్లి భయం ఇప్పటికీ ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలో నల్లపిల్లి అంటే దురదృష్టమని, దుష్టశక్తి అని భావిస్తున్నారు. భారతదేశంలో కూడా నల్లపిల్ల వచ్చిందంటే ఇంట్లోకి దెయ్యం వచ్చినట్టేనని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఐర్లాండ్ వారికయితే నల్లపిల్లి అంటే అస్సలు గిట్టదు. వారు దాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడరు. చూశారా, ఏదో అరిష్టం జరుగుతుందని కంగారు పడిపోతారు. పొరపాటున తమ చేతుల్లో గానీ, తమ పెరట్లో కానీ నల్లపిల్లి చచ్చిపోతే, పదిహేడేళ్ల పాటు శని వెంటాడుతుందని భావిస్తారు వారు. అయితే నల్లపిల్లిని అదృష్ట దేవతగా కొలిచేవారు కూడా ఉన్నారు. వారిలో ఈజిప్షియన్లు ప్రథములు. వారు పూజించే ‘బస్త్’ అనే దేవత మనిషి శరీరంతో, నల్లపిల్లి తలతో ఉంటుంది. అందుకే వారికి నల్లపిల్లి ఎంతో పవిత్రమైనది. ఆ దేశంలో నల్లపిల్లిని చంపితే మరణశిక్షను విధించాలనే చట్టం కూడా మొదట్లో ఉండేది. ఆధునిక చట్టాలు వచ్చాక దాన్ని పాటించడం మానేశారు. అంతేకాదు, సూర్యకిరణాలు నల్లపిల్లి కళ్లలో నిక్షిప్తమై ఉంటాయని, అందుకే అవి మెరుస్తుంటాయని భావిస్తారు వారు. యూకేలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నల్లపిల్లి ఎదురొస్తే శుభం చేకూరుతుందని విశ్వ సిస్తారు. బ్రిటన్ చక్రవర్తి చార్లెస్ 1 దగ్గర ఓ నల్ల పిల్లి ఉండేదట. అది చనిపోతే, తన అదృష్టమంతా పోయిందని బాధపడ్డాడాయన. ఆ తర్వాత రోజే రాజ్యాన్ని కోల్పోవడమే కాక, జైలు పాలయ్యాడు కూడా. అప్పట్నుంచే బ్రిటన్‌లో ఈ నమ్మక పెరిగిందని అంటారు. స్కాట్లాండ్ వారికి కూడా నల్లపిల్లి శుభసూచకం. తెల్లవారు జామున దాన్ని చూస్తే మరీ మంచిదని అనుకుంటారు వారు. బహుశా ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాతే నల్లపిల్లి అదృష్టం తెచ్చిపెడుతుందని అంతా నమ్మి ఉంటారు. మరి ఏం చూసి అది అరిష్టం తెచ్చిపెడుతుందని యూరోపియన్ దేశాల్లో నమ్ముతున్నారు? అలా నమ్మడానికి బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అయినా ఒకే విషయం ఒకరికి అదృష్టాన్ని, ఒకరికి దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతోంది? వీటన్నిటికీ సమాధానం దొరికిన రోజు గానీ ఇది నమ్మకమో మూఢనమ్మకమో అర్థం కాదు!