కాపురంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో మనస్పర్థలూ అంతే సహజం. కాని కొంతమందికి జీవితంలో మనశ్శాంతి కరువవుతుంది. జీవితభాగస్వామి బాధపెడుతుంటే భార్య/భర్త తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురికావలసి వస్తుంది. అర్థం చేసుకోని లైఫ్‌పార్ట్‌నర్ దొరికినప్పుడు సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అయితే మీరే అర్థం చేసుకోగలిగినప్పుడు బాధపెట్టే జీవితభాగస్వామితో సర్దుకొని పోవచ్చు. కాని దానికీ పరిధి ఉంటుంది. బాధ పెట్టడం మరీ ఎక్కువైనప్పుడు, మీరు భరించలేని స్థితికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారమయ్యేవరకు మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు దూరంగా ఉండటమే మంచిది. అయితే పరిస్థితి అంతదూరం రానివ్వకుండా మీ జీవితభాగస్వామితో కలిసివుండే ప్రయత్నం చేయచ్చు. బాధపెట్టే మీ జీవితభాగస్వామితో కలిసి ఉండగలరా? మీలో ఆ నైపుణ్యం, ఓర్పు ఉందా?
1. మీ జీవితభాగస్వామి బలహీనతలను అర్థం చేసుకొని, వారిని క్షమించగలరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు.
ఎ. అవును బి. కాదు
2. ఎవరైనా ప్రతిసారీ తప్పు చేయరని నమ్ముతారు. బాధతో ఉన్నప్పుడు మీ జీవితభాగస్వామితో మీరు గడిపిన సంతోష క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
3. మిమ్మల్ని బాధలకు గురిచేసిన సంఘటనలను మనసులో ఉంచుకోరు. ప్రతిరోజూ కొంత సమయాన్ని విశ్రాంతిగా గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
4. ప్రతిమనిషికీ సమస్యలుంటాయనుకుంటారు. జీవించినంత కాలం ఆనందంగా ఉండాలని మనసులో గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. మీలా సమస్యల్లో బాధ పడేవారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, వీలైతే మీ జీవితభాగస్వామికి నచ్చిన విధంగా నడుచుకొనే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
7. ఎప్పుడూ అధైర్యపడరు. సమస్యలను ఎదుర్కొనేందు ధైర్యం అవసరమనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. లైఫ్‌పార్ట్‌నర్ బాధ పెట్టేటప్పుడు మాట్లాడకుండా ఉండరు. వారి సమస్య ఏమిటని ప్రశ్నిస్తారు. మీరెంత బాధ పడుతున్నారో వివరించే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
9. వాదనకు దిగరు. ఎక్కువసేపు వాదోపవాదాలను కొనసాగనివ్వరు. ఆర్గ్యుమెంట్ వల్ల రిలేషన్ మరింత దెబ్బతింటుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
10. ఎక్కువ కాలం మీ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించరు. ఆందోళనతో మీ నిద్ర, ఆరోగ్యం చెడగొట్టుకోరు.(ఇదే సమయంలో మీ లైఫ్ పార్ట్‌నర్ ఆనందంగానే ఉంటారని గుర్తించగలరు).
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ లైఫ్ పార్ట్‌నర్ ఇబ్బందులకు గురిచేస్తున్నా వారితో సర్దుకుపోవాలనుకుంటారు. మీలో సహనగుణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవితభాగస్వామితో కలిసుండేలా చేస్తుంది. కోపం వచ్చినా మీ పార్ట్‌నర్‌ను అర్థం చేసుకుంటారు. ‘బి’ సమాధానాలు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే బాధపెట్టే మీ పార్ట్‌నర్‌తో మీరు కలిసివుండలేరు. సర్దుకుపోలేక పోవటం వల్ల అలజడికి గురవుతారు. మీ మధ్య చిన్న చిన్న విషయాల వల్ల విభేదాలు వచ్చినా, మీ జీవితభాగస్వామి కలిగించే ఇబ్బందులు మితిమీరకుండా ఉన్నా వాటిని క్షమించటానికి ట్రై చేయండి. ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
Comments
Please login to add a commentAdd a comment