మా సహనం బలహీనతగా అనుకోవద్దు | Think that our patience weakness | Sakshi
Sakshi News home page

మా సహనం బలహీనతగా అనుకోవద్దు

Published Sun, Sep 25 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

Think that our patience weakness

  • ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యతే లేదు
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వద్దనే మౌనం 
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సహోదర్‌రెడ్డి
  • పరకాల : మా సహనాన్ని బలహీనతగా, చేతగాని తనంగా అనుకోవద్దని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అందరిని కలుపుకొని పోవాల్సిన నైతిక బాధ్యత ఉంది. పాత వాళ్లకు ఎలాంటి రిసీవింగ్‌ లేక ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఓపిక పడుతున్నాం. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. వేరే పార్టీలో గెలిచినప్పటికీ పార్టీ బలోపేతం కోసం టీఆర్‌ఎస్‌లో చేరిన అభ్యంతరం చెప్పలేదన్నారు. కానీ పార్టీలో చేరినప్పటి నుం చి పాతవాళ్లకు గుర్తింపు లభించడం లేదన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని నాకే ఏం తెలియడం లేదు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దనే మౌనంగా ఉంటున్నామన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో పాత, కొత్తవారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరకాల ను జిల్లా కేం ద్రంగా చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. కనీసం రెవెన్యూ డివిజ¯ŒSగానైనా ఉండాలన్నారు. రెండు రాకపోతే పరకాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందని సహోదర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతిని  పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement