డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వస్తున్న దేశీ కరెన్సీ నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 9 పైసలు బలపడి 75.51 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడం, దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు వంటి అంశాలు రూపాయికి జోష్‌నివ్వడంతో భారీగా లాభపడింది. డాలరుతో మారకంలో 59 పైసలు(0.8 శాతం) జంప్‌చేసి 75.01కు చేరింది. వెరసి ఏప్రిల్ 23 తదుపరి ఒకే రోజు అత్యధికంగా బలపడింది. ఒక దశలో 74.96 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. తద్వారా మార్చి 27నాటి 75 స్థాయికి చేరింది. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 75.60 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 97కు నీరసించడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో యూరోజోన్, యూకేల తయారీ రంగం అంచనాలను మించిన వార్తలతో డాలరుతో మారకంలో యూరోతోపాటు.. యూకే పౌండ్ పుంజుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment