సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, డాలరు బలం, ఈక్విటీల భారీ నష్టాల కారణంలో రూపాయి ఆరంభంలోనే నష్టపోయింది. అనంతరం డాలరు మారకంలో 16 పైసలు క్షీణించి 75.35 వద్దకు చేరుకుంది. చివరికి 23 పైసలు నష్టంతో 75.41వద్ద స్థిరపడింది. సోమవారం 75.19 వద్ద ముగిసింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు తోడు 6.09 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం, ప్రధానంగా ఆహార వస్తువుల ధరల భారీగా పెరగడం, డాలరు బలం లాంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేశామని ఫారెక్స్ ట్రేడర్లు భావిస్తున్నారు. సీపీఐ గణాంకాల ప్రకారం జూన్ లో ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతం పెరిగింది. అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 1.81 శాతం క్షీణించింది. మేనెలలోఇది 3.21 శాతంగా ఉంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.01 శాతం పడి బ్యారెల్‌కు 41.86 డాలర్లకు, డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.56 వద్దకు చేరుకుంది. అటు సెన్సెక్స్800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 10602 వద్ద కొనసాగుతోంది. అటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 23,727 కు పెరగ్గా, కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది.
Comments
Please login to add a commentAdd a comment