సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ఆందోళనలు దీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా మారిపోతోంది. దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీన పడుతోంది. ఈ నేపథ్యంలోనే డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రుపీ శుక్రవారం మరింత బలహీన పడింది. ఆరంభంలోనే 39 పైసలు క్షీణించింది. ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.08 కు చేరుకుంది. మంగళవారం 75.66 వద్ద ముగిసింది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.44 శాతం బలపడి బ్యారెల్ కు 28.91 డాలర్లకు చేరుకుంది.ముడి ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రష్యా, సౌదీ అరేబియా ధరల యుద్ధానికి చెక్ పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడంతో ఆయిల్ ఫ్యూచర్స్ గురువారం 30 శాతానికి పైగా ఎగిసింది.మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆరంభంలోనే 400 పాయింట్లు క్షీణించింది. కీలక సూచీలు రెండూ మద్దతు స్థాయిలను కోల్పోయాయి. వెంటనే కోలుకున్నప్పటికీ, తిరిగి భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
చదవండి : అమ్మకాల ఒత్తిడి, 8200 దిగువకు నిఫ్టీ
Comments
Please login to add a commentAdd a comment