మూడు నెలల కనిష్ట విలువకు రూపాయి | The rupee is a three-month low | Sakshi
Sakshi News home page

మూడు నెలల కనిష్ట విలువకు రూపాయి

Published Thu, Mar 1 2018 1:04 AM | Last Updated on Thu, Mar 1 2018 1:04 AM

The rupee is a three-month low - Sakshi

ముంబై: డాలర్‌తో రూపాయి వెలవెలబోయింది. ఒకే రోజు బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో 30 పైసలు పడిపోయి 65.17కు చేరింది. రూపాయికి ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జీరోమ్‌పావెల్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో బలంగా ఉంటుందని, ఈ ఏడాది కూడా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందంటూ చేసిన ప్రకటనతో డాలర్‌ బలం పుంజుకుంది.

ఇంట్రాడేలో రూపాయి 65.32 వరకూ తగ్గింది. ఆ తర్వాత తిరిగి కాస్త కోలుకుని నికరంగా 30 పైసలు నష్టం (0.46 శాతం)తో 65.17 వద్ద క్లోజయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement