పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్ | Rupert Murdoch-led News Corp raises stake in PropTiger | Sakshi
Sakshi News home page

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్

Published Wed, Jun 17 2015 1:37 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్ - Sakshi

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్

ముంబై: ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సేవల పోర్టల్ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌లో మీడియా దిగ్గజం న్యూస్‌కార్ప్ తన వాటాలను మరో 5 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం వాటా 30 శాతానికి చేరింది. ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్ మాతృసంస్థ ఎలరా టెక్నాలజీస్‌లో న్యూస్‌కార్ప్ వాటాలను పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యపడింది. 2014 నవంబర్‌లో ఎలరాలో న్యూస్‌కార్ప్ 30 మిలియన్ డాలర్లతో 25% వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, దీర్ఘకాలంలో ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌కి పరిస్థితులు ఆశావహంగానే ఉండగలవని న్యూస్‌కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు నరిశెట్టి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement