సచిన్ మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ ఇదే!
సచిన్ మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ ఇదే!
Published Sat, May 6 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
ఇటు స్మార్ట్ ఫోన్ లవర్స్, అటు క్రికెట్ అభిమానులు నప్పేలా, మెచ్చేలా ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్మార్ట్రాన్ తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఆ ఫోన్ ను క్రికెట్ దేవుడు సచిన్ టెండ్కూలర్ పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని ఎస్ఆర్ టి.ఫోన్ పేరుతో దీన్ని విడుదల చేశారు. ఈ ఫోన్ లాంచ్ చేసే సందర్భంగా తనకి ఎస్ఆర్టీ.ఫోన్ ఎలా స్ఫూర్తినిచ్చిందో సచిన్ వివరించారు. అంతేకాక కేవలం పాశ్చాత్య ఉత్పత్తులపైన ఆధారపడటమే కాకుండా.. ప్రపంచ టెక్నాలజీకి దేశీయ స్టార్టప్ లు టెక్నాలజీ ఎలా అందించే దిశగా వచ్చాయో తెలిపారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తో సంస్థ కోఫౌండర్ మహేశ్ లింగారెడ్డి ఓ సెల్ఫీ ఇంటర్య్యూను చేపట్టారు. ఇంతకముందు సచిన్ టెండూల్కర్ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ, సెల్ఫీ ఇంటర్వ్యూ మాత్రం స్పెషల్. ఇప్పటివరకు సచిన్ ఎలాంటి సెల్ఫీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదే మొదటి సెల్ఫీ ఇంటర్వ్యూ అని తెలిసింది. ఈ ఇంటర్వ్యూలో మేకిన్ ఇండియా టెక్ గురించి సచిన్ ఎంతో గొప్పగా వివరించారు. మరోవైపు స్మార్ట్రాన్ ప్రాజెక్ట్‌లో టెండూల్కర్ స్ట్రాటజిక్ పార్టనర్ కావడం విశేషం. ఫింగర్ ప్రింట్ సెన్సిర్ తోపాటు ఆ ప్రతి ఫోన్ బ్యాక్ కవర్‌పై టెండూల్కర్ ఆటోగ్రాఫ్ రావడం ఎస్ఆర్టీ ఫోన్ స్పెషాలిటీ.
Advertisement
Advertisement