న్యూయార్క్ ప్లాజా హోటల్(ఫైల్)
ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పడు రాజాలా బతికిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు. బెయిల్ ఇవ్వాలంటే రూ. 10 వేల కోట్లు కట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆయన విదేశాల్లోని ఆస్తులను అమ్మకానికి పెట్టారు.
అత్యంత ఖరీదైన, విలాసవంతమైన న్యూయార్క్ ప్లాజా హోటల్, లండన్ లోని గ్రోస్వెనర్ హౌస్ ను అమ్మేందుకు సిద్దమయ్యారు. బెయిల్ కోసం నిధులు సమీకరించుకునేందుకు జైలు నుంచే ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.