శామ్‌సంగ్.. రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు | Samsung has two 4G smartphones | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్.. రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు

Published Thu, Jul 16 2015 11:39 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

శామ్‌సంగ్.. రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు - Sakshi

శామ్‌సంగ్.. రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శామ్‌సంగ్ ‘గెలాక్సీ జే5’, ‘గెలాక్సీ జే7’ అనే రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.11,999, రూ. 14,999గా ఉన్నాయి. ‘గెలాక్సీ జే5’ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ,13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 5.5 అంగుళాల తెర, 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ‘గెలాక్సీ జే7’ స్మార్ట్‌ఫోన్ సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ప్రి-బుకింగ్ వినియోగదారులకు 22 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement