చౌక గృహ రుణాలపై ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌! | SBI bumper offer on cheap home loans | Sakshi
Sakshi News home page

చౌక గృహ రుణాలపై ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌!

Published Tue, May 9 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

చౌక గృహ రుణాలపై ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌!

చౌక గృహ రుణాలపై ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌!

వడ్డీ రేటు పావు శాతం వరకూ రేటు తగ్గింపు
ప్రస్తుతం 8.60 శాతం
మహిళా ఉద్యోగులకు అతి తక్కువగా 8.35 శాతం


రుణాలపైముంబై:
చౌక గృహాలకు తగిన రుణ రేటును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియలో ఇటీవల క్రెడాయ్‌తో ఒక కీలక అవగాహనకు వచ్చిన బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ దిశలో సోమవారం ముందడుగు వేసింది. చౌక గృహ రుణ రేట్లను పావు శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువగా 8.35% వడ్డీరేటును అమలు చేయనుంది. తాజా తగ్గింపు మంగళవారం నుంచే అమల్లోకి వస్తుంది.

పురుషులకు జూలై 31 వరకే!
►  పురుషులకు సంబంధించి తాజా తగ్గింపు ఆఫర్‌ పరిమితకాలమే– అంటే జూలై 31వ తేదీ వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. వేతన జీవులకు 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు) తక్కువగా 8.40% రుణ రేటు అమలవుతుంది.
►  కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగుల విషయంలో 0.25 శాతం రుణ తగ్గింపు ఆఫర్‌ లభిస్తే, ఉద్యోగం లేని మహిళల విషయంలో ఈ ఆఫర్‌ 20 బేసిస్‌ పాయింట్లు ఉంది.
► అలాగే ఉద్యోగం చేసే పురుషుల విషయంలో రుణరేటు 8.40 శాతంగా ఉంటే, ఉద్యోగం లేని వారి విషయంలో ఈ రేటు 8.45 శాతం ఉంటుంది.
►  25 బేసిస్‌ పాయింట్ల రుణ తగ్గింపు అంటే– నెల వారీగా రూ.530 పొదుపైనట్లని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజ్‌నీష్‌ కుమార్‌ పేర్కొన్నారు.
► గృహ రుణ రేట్ల గురించి బ్యాంకింగ్‌ సంప్రదింపులు పెరిగాయని తమ పరిశీలనలో తేలిందని, అందువల్లే తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. తాజా నిర్ణయం సొంత ఇల్లు కల మరిన్ని లక్షల మందికి సాకారమవుతుందని భావిస్తున్నట్లూ ఆయన పేర్కొన్నారు. 2022కి అందరికీ గృహం అన్న ప్రభుత్వ సంకల్పానికి తమ వంతు కృషిని బ్యాంకింగ్‌ చేస్తుందని వివరించారు.
► ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పుస్తక విలువ రూ.2.23 లక్షల కోట్లు. గృహ రుణాల విషయంలో సంస్థకు అత్యధికంగా 25 నుంచి 26 శాతం మార్కెట్‌  వాటా ఉంది.
► చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్‌ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ– సిబిల్‌ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉంది. మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది.
► హౌసింగ్‌ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలను అందించడానికి సంబంధించి ఎస్‌బీఐ, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్‌  మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... చౌక, గ్రీన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో డెవలపర్లు, కస్టమర్లకు రాయితీలపై రుణాలు లభ్యమవుతాయి. ఎస్‌బీఐ గ్రీన్‌ హౌస్‌ లోన్స్‌ కింద గృహ రుణాల విషయంలో ప్రాసెసింగ్‌ ఫీజును కూడా రద్దు చేస్తారు. ‘‘క్రెడాయ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. గృహ కొనుగోలుదారులకు వడ్డీ రేటులో 10 బేసిస్‌ పాయింట్ల (0.10 శాతం) రాయితీని అందిస్తాం. క్రెడాయ్‌ డెవలపర్‌ మెంబర్లకు 10 నుంచి 35 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో రాయితీ లభిస్తుంది’ అని రజ్‌నీష్‌ కుమార్‌ గతంలో తెలిపారు.

చౌక గృహమంటే...
ప్రభుత్వ నూతన పథకం కింద రూ. 30 లక్షల వరకూ రుణాన్ని చౌక గృహ రుణంగా పరిగణించడం జరుగుతుంది. దీనికింద రుణ గ్రహీత రూ.2.67 లక్షల వడ్డీ సబ్సిడీ పొందే వీలుంది.

అతి తక్కువ వడ్డీరేటు...
ప్రస్తుతం ఎస్‌బీఐ ఈ విభాగంలో ఆఫర్‌ చేస్తున్న రేటు మార్కెట్‌లోనే అతి తక్కువ కావడం గమనార్హం. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా దాదాపు 26 శాతం మార్కెట్‌ వాటా కలిగిన ఎస్‌బీఐ, ప్రస్తుతం గృహ రుణ సెగ్మెంట్‌లో 8.60 శాతం వడ్డీతో అతి తక్కువ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ విభాగంలో రెండవ స్థానంలో ఉన్న– హెచ్‌డీఎప్‌సీ మహిళలకు సంబంధించి 8.65 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఇతరుల విషయంలో ఈ రేటు 8.7 శాతంగా ఉంది. ఇదే రేటును ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది.

తగ్గిన రేట్లు ఇలా... (అంకెలు శాతాల్లో)
కేటగిరీ                             తగ్గింపు              తగ్గిన తర్వాత
మహిళా ఉద్యోగులు               0.25                 8,35
మహిళలు                          0.20                 8.40
ఉద్యోగం చేసే పురుషులు         0.20                 8.40
పురుషులు                         0.15                8.45

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement