గృహరుణాలపై ఎస్‌బీఐ తీపికబురు | SBI introduces Special Home Loan Interest rate for a limited period up to 31st July’ 2017. Avail the opportunity | Sakshi
Sakshi News home page

గృహరుణాలపై ఎస్‌బీఐ తీపికబురు

Published Wed, Jun 14 2017 5:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

గృహరుణాలపై ఎస్‌బీఐ తీపికబురు

గృహరుణాలపై ఎస్‌బీఐ తీపికబురు

ముంబై:  అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  తన వినియోగదారులకు  తీపి కబురు అందించింది.  హోం లోన్లపై ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  గృహరుణాలపై   కస్టమర్లకు  ప్రత్యేక వడ్డీరేట్లను  ప్రకటించింది.  పరిమిత కాలానికి గాను ఈ అవకాశాన్ని అందిస్తోంది.

గృహరుణాలపై ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్‌ చేస్తున్నట్టు బుధవారం ట్విట్టర్‌  ద్వారా వెల్లడించింది.  ఈ రోజు (జూన్‌ 14) నుంచి 2017, 31 జూలై లోపు తీసుకున్న హోంలోన్లపై స్పెషల్‌ వడ్డీరేటును వర్తింపచేయనున్నట్టు ట్వీట్‌ చేసింది.   ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాల్సిందిగా  ఖాతాదారులను కోరింది. అయితే వడ్డీరేట్లపై పూర్తి  సమాచారాన్ని  మాత్రం ఎస్‌బీఐ అధికారికంగా  ప్రకటించలేదు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement