Limited Period
-
సిగ్నేచర్ గ్లోబల్ @ రూ. 366–385
ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది. కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్‌సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా గురుగ్రామ్‌లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
పోకో ఎఫ్1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: షావోమీ సబ్ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఫ్లాష్ సేల్‌లో రికార్డు విక్రయాలను నమోదు చేసిన పోకోఎఫ్1 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 5వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది. డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌లోఈ ఆఫర్ లభించనుంది. ట్విటర్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ట్వీట్ల ద్వారా వినియోగదారులను గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు మొత్తం అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ POCO community is live! Yes, you read it right. We are launching POCO community, a place where POCO fans from around the globe can come together and feel at home. So what are you waiting for? Log on to https://t.co/d1eeZRKzSi and be a part of POCO community now! 🤟 pic.twitter.com/V7FgM9RmrT — POCO India (@IndiaPOCO) December 4, 2018 -
గూగుల్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ ధరలు భారీగా తగ్గాయి. హాలిడే సీజన్ లో పరిమత కాలం ఆఫర్ కింద ఈ తగ్గింపును అందిస్తున్నట్టు గూగుల్ శుక్రవారం ప్రకటించింది. క్రెడిట్ కార్డు చెల్లింపుపై డిసెంబర్ 31 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 2 64జీబీ,128జీబీ వేరియంట్లకు రూ. 11,001పరిమిత కాలం డిస్కౌంట్ అందిస్తోంది. పిక్సెల్ 2ఎక్స్ఎల్ 64జీబీ, 128జీబీ వేరియంట్లపై రూ. 5.001 తగ్గింపు. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు కొనుగోలు ద్వారా రూ. 8వేల డిస్కౌంట్‌తో పిక్సెల్ 2 (64జీబీ) రూ. 41,999కి (ఎంఆర్పి రూ.61వేలు) లభించనుంది. పిక్సెల్ 2 128జీబీ రూ. 50,999 (అసలు ధర రూ 70,వేలు), పిక్సెల్ 2 ఎక్స్ఎల్ 64 జీబీ రూ. 56,999 (అసలు ధర రూ. 73 వేలు), అలాగే 128 జీబీ వెర్షన్ రూ.65,999 (అసలు ధర రూ.82వేలు) ధరలో అందుబాటులో ఉంటుంది. కొనుగోలు చేసిన 90 రోజుల్లో డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీకి మాత్రమే వర్తించే క్యాష్ బ్యాక్ ఆ ఫర్ డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. -
గృహరుణాలపై ఎస్బీఐ తీపికబురు
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. హోం లోన్లపై ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గృహరుణాలపై కస్టమర్లకు ప్రత్యేక వడ్డీరేట్లను ప్రకటించింది. పరిమిత కాలానికి గాను ఈ అవకాశాన్ని అందిస్తోంది. గృహరుణాలపై ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్ చేస్తున్నట్టు బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ రోజు (జూన్ 14) నుంచి 2017, 31 జూలై లోపు తీసుకున్న హోంలోన్లపై స్పెషల్ వడ్డీరేటును వర్తింపచేయనున్నట్టు ట్వీట్ చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఖాతాదారులను కోరింది. అయితే వడ్డీరేట్లపై పూర్తి సమాచారాన్ని మాత్రం ఎస్బీఐ అధికారికంగా ప్రకటించలేదు. SBI introduces Special Home Loan Interest rate for a limited period up to 31st July’ 2017. Avail the opportunity. https://t.co/nLCuFyB9vD pic.twitter.com/jaRyxCDW7B — State Bank of India (@TheOfficialSBI) June 14, 2017 -
లెనోవా వైబ్ కే5 నోట్‌పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్
ముంబై: లెనోవా వైబ్ కె 5 నోట్‌పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లపై పరిమితకాలంలో అందిస్తున్న ఈ ఆఫర్ ను గురువారం వెల్లడించింది. లెనోవా వైబ్ కే 5 4జీబీ, 3జీబీ రెండు వేరియంట్లపై రూ. 500 డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు ఈ సిరిస్‌లోని ఇతర వేరియంట్లు కొత్త ధర ట్యాగ్ లతో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉన్నాయి. గ్రే, సిల్వర్ , గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న 3జీబీ మోడల్‌ను రూ. 11,499కే అందించనుంది. దీని అసలు ధరరూ.11,999గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ వేరియంట్‌ను 12,999 లకే అందిస్తోంది. దీని అసలు ధర రూ.13,499. మిగిలన అన్ని ఫీచర్లతోపాటు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్ పవర్డ్ స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వీటి ప్రత్యేకతలు. గతఆగష్టు లో ఇండియాలో లాంచ్ అయిన గలెనోవా వైబ్ కే 5 నోట్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. లెనోవా వైబ్ కే 5 నోట్ 5.5 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సెల్ ప్రాసెసర్ 1.8గిగా హెడ్జ్ అక్టాకోర్ ప్రాసెసర్ 8 ఎంపీ ఫ్రంట్‌కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 32 జీబీ స్టోరేజ్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ లెనోవా నోట్ 5 ఏ వేరియంట్లో డిస్కౌంట్, ఎంతకాలానికి ఈ ఆఫర్ లాంటి వివరాలకోసం ఫ్లిప్ కార్ట్ ను వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. -
ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్
క్రియో సంస్థ 'క్రియో మార్క్ 1' పేరుతో విడుదల చేసిన తన నూతన స్మార్ట్ ఫోన్‌పై ధరలు తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్‌లో ఈ ఫోన్‌పై 6వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గించిన ధరతో రూ.19,999గా ఉన్న ఈ ఫోన్ ఇక నుంచి మార్కెట్లో రూ.13,999కే లభ్యంకానున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ లిమిటెడ్ ఆఫర్ ఆగస్టు 15తో ముగుస్తుందని పేర్కొంది. క్రియో మార్క్1 ఫోన్‌పై ధరలు తగ్గడం ఇదే మొదటిసారీ కాదు. గత నెలలో కూడా ఇదేమాదిరి పరిమిత కాలంలో ఈ ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. క్రియో మార్క్1 ఫీచర్లు.. 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్డీ(1440 x 2560 పిక్సల్స్) రిజల్యూషన్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ డ్యుయల్ సిమ్(మైక్రోసిమ్, నానో సిమ్) 1.95 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 21 మెగాపిక్సల్ రియర్ ఆటోఫోకస్ కెమెరా 4కే వీడియో రికార్డింగ్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 4జీ ఎల్టీఈ 3100 ఎంఏహెచ్ బ్యాటరీ