
నన్ను జైలుపాలు చేయడం తగదు
న్యూఢిల్లీ: తనను జైలుపాలు చేయడం తగదంటూ బుధవారం సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టు ఎదుట హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తద్వారా విచారణలో కొత్త అంకానికి తెరలేపారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విషయంలో హెబియస్ కార్పస్ రిట్ పరిధి అంశాలు ఇమి డి ఉన్నాయని విన్నవించారు. మార్చి 4న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ, రాయ్‌ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణం ఈ కేసును విచారించాలని విజ్ఞప్తి చేశారు.
ఒక వ్యక్తిని నిర్బంధించడం లేదా జైలులో ఉంచడం చట్టబద్ధ్దమైనదా కాదా అన్న అంశా న్ని నిర్ధారించడానికి సంబంధిత వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడానికి ఈ రిట్‌ను దాఖలు చేయడం జరుగుతుంది. రాయ్ ని నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశా ల్లో లోటుపాట్లు చోటుచేసుకున్నాయని, వీటిని తక్ష ణం సవరించాల్సి ఉందని జెఠ్మలానీ వివరించారు. రాయ్ దాఖలు చేసిన పిటిష న్ రిజిస్ట్రీ వద్ద నంబరయితే మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై విచారణ జరుగుతుందని బెంచ్ పేర్కొంది. అయితే చీఫ్ జస్టిస్ రిఫరెన్స్ మేరకు ఈ పిటిషన్ మధ్యాహ్నం, కేసును మామూలుగా విచారిస్తున్న జస్టిస్ రాధాకృష్ణన్, జేఎస్ కేల్కర్ ముందుకే వచ్చింది. ఈ సందర్భంగా జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ‘మీ ఆర్డర్ తప్పం టూ మీ బెంచ్ ముందే వాదనలు వినిపించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది’ అని అన్నారు. అయినా బెంచ్ ఇందుకు సిద్ధమయితే తన వాదనలు వినిపించడానికి సిద్ధమని పేర్కొన్నారు. అయితే గురువారం పిటిషన్ ను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.