న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తోపాటు మరో మూడు సంస్థల ఐపీవోలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా లిమిటెడ్, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఐపీవోలో కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటాకు సమానమైన 3.61 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్ ఐపీవోలో 78,27,656 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా గ్రిఫిన్ పార్ట్‌నర్స్ విక్రయించనుండగా, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ 19,56,914 షేర్లను ఆఫర్ చేస్తోంది.
ఈ ఐపీవోలో రూ.700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సప్లయ్ చైన్ సొల్యుషన్స్ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది. ఇక గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీవోలో భాగంగా రూ.195 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే, కంపెనీలో ప్రస్తుత వాటాదారులు సైతం 6 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment